ఎన్టీఆర్.. ఇది మరీ టూమచ్ అమ్మా!

ఎన్టీఆర్.. ఇది మరీ టూమచ్ అమ్మా!

మొన్న 'బిగ్ బాస్' షోకు సంబంధించిన ప్రెస్ మీట్‌ను బాగానే రక్తి కట్టించాడు జూనియర్ ఎన్టీఆర్. మీడియా వాళ్లతో అంత తెలివిగా మాట్లాడుతూ.. సమాధానాలు దాటవేయకుండా తెలివిగా మాట్లాడుతూ.. ఆసక్తికర జవాబులిస్తూ ఈ ప్రెస్ మీట్‌కే ఒక ఆకర్షణ తీసుకొచ్చాడు తారక్. కానీ ఈ సందర్భంగా తారక్ చెప్పిన కొన్ని ముచ్చట్లు మాత్రం ఆశ్చర్యం కలిగించాయి.

'బిగ్ బాస్' హౌస్‌లో ఉండబోయే పార్టిసిపెంట్లు ఎవరన్నది తనకు ఎంతమాత్రం తెలియదని.. షో మొదలయ్యే సమయానికి సామాన్య ప్రేక్షకుల్లాగే తాను కూడా వాళ్ల గురించి తెలుసుకుంటానని అన్నాడు తారక్. కానీ కనీసం పోటీదారులు ఎవరో కూడా తెలియకుండానే ఎన్టీఆర్ షో ఒప్పుకున్నాడంటే నమ్మేవాళ్లు ఎవరూ లేరిక్కడ. నిజానికి మా టీవీ వాళ్లు ఎన్టీఆర్‌కు పార్టిసిపెంట్ల గురించి ముందే సమాచారం ఇచ్చారట.

ఐతే సన్నిహితుల దగ్గర కూడా ఈ సమాచారం బయటపెట్టొద్దని.. ఏ రకంగా లీక్ అయినా అందరికీ తెలిసిపోతుందని స్పష్టంగా చెప్పారట. తమిళ 'బిగ్ బాస్'లో పాల్గొన్న పార్టిసిపెంట్ల విషయంలో అక్కడ పెద్ద రచ్చే జరిగింది. సోషల్ మీడియాలో ట్రోలింగ్ మామూలుగా లేదు. పైగా ఆ షో అక్కడ డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడం మా టీవీ వాళ్లలో గుబులు రేపుతోంది.

ఈ నేపథ్యంలో తెలుగు 'బిగ్ బాస్' పార్టిసిపెంట్ల సంగతి ముందే లీక్ అయి.. సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరిగితే చాలా ఇబ్బందికర పరిస్థితి ఎదురవుతుందన్న ఉద్దేశంతో ఎన్టీఆర్‌కు ఆ విధంగా చెప్పినట్లు సమాచారం. పార్టిసిపెంట్ల విషయంలో ఎన్టీఆర్ కూడా కొన్ని సూచనలు చెప్పినట్లు సమాచారం. కానీ ప్రెస్ మీట్లో మాత్రం ఇదేమైనా సినిమానా.. నిర్మాతకు చెప్పి రెకమండ్ చేయడానికి అంటూ సమాధానం దాటవేశాడు తారక్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు