దిల్‌ రాజు ఈసారి ఎవరిని దించుతాడు

దిల్‌ రాజు ఈసారి ఎవరిని దించుతాడు

హరీష్‌ శంకర్‌ ఇప్పుడు దిల్‌ రాజు ఆస్థాన దర్శకుడైపోయాడు. రామయ్యా వస్తావయ్యా ఫ్లాప్‌ అయినా కానీ దిల్‌ రాజు అతనికి మళ్లీ అవకాశమిచ్చాడు. సుబ్రమణ్యం ఫర్‌ సేల్‌తో దిల్‌ రాజు కాసిని లాభాలు తెచ్చి పెట్టిన హరీష్‌ శంకర్‌కి తర్వాతి చిత్రానికి అల్లు అర్జున్‌ని ఇచ్చాడు.

ఫ్లాప్‌ కాకుండా చూసుకోవడానికి హరీష్‌ శంకర్‌ సేఫ్‌ గేమ్‌ ఆడాడు. బయ్యర్ల మాటేమో కానీ డీజే వల్ల దిల్‌ రాజుకి అయితే లాభాలొచ్చాయి. దీంతో హరీష్‌తో మరో చిత్రానికి కూడా దిల్‌ రాజు శ్రీకారం చుడుతున్నాడు. ఇప్పటికే హరీష్‌కి అడ్వాన్స్‌ ఇచ్చేసి నెక్స్‌ట్‌ సినిమాకి కమిట్‌ చేయించుకున్నాడు. హరీష్‌ శంకర్‌ కూడా దిల్‌ రాజు బ్యానర్లో వున్న అడ్వాంటేజ్‌ వల్ల బయటకి వెళ్లడానికి ఇష్టపడడం లేదు.

హరీష్‌తో మలి చిత్రం ఎప్పుడనేది దిల్‌ రాజు ఇంకా డిసైడ్‌ చేయలేదు. హీరో ఎవరనేది ఫిక్స్‌ అయితే హరీష్‌ కథ సిద్ధం చేసుకుంటాడు. మరి హరీష్‌ శంకర్‌ కోసం ఈసారి దిల్‌ రాజు ఎవరిని తీసుకొస్తాడు? స్టార్‌ హీరోలు దొరక్కపోతే మిడిల్‌ రేంజ్‌ హీరోతో సరిపెట్టుకోమంటాడా లేక ఇంకో స్టార్‌నే తెచ్చి హరీష్‌ చేతిలో పెడతాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు