కరణ్ జోహార్.. ‘స్పైడర్’ను పట్టుకుంటాడా?

కరణ్ జోహార్.. ‘స్పైడర్’ను పట్టుకుంటాడా?

పైసా పెట్టుబ‌డి లేకుండా ‘బాహుబ‌లి’ రెండు భాగాల్ని హిందీలో రిలీజ్ చేయ‌డం ద్వారా భారీగానే ఆదాయం మూట‌గ‌ట్టుకున్నాడు బాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ క‌మ్ ప్రొడ్యూసర్ క‌ర‌ణ్ జోహార్. ‘బాహుబ‌లి’ ఇచ్చిన ఊపులో రానా సినిమా ‘ఘాజీ’ని కూడా అత‌ను త‌న బేన‌ర్ మీదే రిలీజ్ చేశాడు. మంచి ఫ‌లితాన్నే అందుకున్నాడు. ఇప్పుడ‌త‌డి క‌ళ్లు మ‌రో సౌత్ ఇండియన్ సినిమా మీద ప‌డ్డ‌ట్లుగా క‌నిపిస్తోంది. ఆ సినిమా మ‌రేదో కాదు.. ‘స్పైడ‌ర్’.

గురువారం రిలీజైన ‘స్పైడ‌ర్ టీజ‌ర్ చూసి.. థ్రిల్ల‌యిపోయిన క‌ర‌ణ్ జోహార్.. ఈ టీజ‌ర్ ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంద‌ని.. ఇలాంటి విశేషాలు మ‌రిన్ని చూడాల‌ని ఉత్సాహంగా ఉంద‌ని అంటూ మ‌హేష్ బాబు, మురుగ‌దాస్‌ల‌కు ఆల్ ద బెస్ట్ చెప్పాడు. క‌ర‌ణ్ సౌత్ ఇండియాలో వ‌చ్చే అన్ని సినిమాల గురించి స్పందించ‌డు. ఇలా రెస్పాండ్ అయ్యాడంటే అందుకు కార‌ణం ఉంటుంద‌ని భావిస్తున్నారు.

తెలుగు, త‌మిళంలో ద్విభాషా చిత్రంగా తెర‌కెక్కుతున్న ‘స్పైడ‌ర్‌ను హిందీలోనూ అనువాదం చేయ‌నున్నారు. ‘గ‌జిని’, ‘హాలిడే’ లాంటి సినిమాల‌తో మురుగ‌దాస్‌ హిందీ ప్రేక్ష‌కుల్లో మంచి ఫాలోయింగే సంపాదించాడు. మ‌హేష్ బాబు మీద కూడా అక్కడి ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తి ఉంది. ‘స్పైడ‌ర్’ బాలీవుడ్ ప్రేక్ష‌కుల టేస్టుకు త‌గ్గ ఇంట‌లిజెంట్ థ్రిల్ల‌ర్ మూవీలా క‌నిపిస్తోంది. ఈ నేప‌థ్యంలో క‌ర‌ణ్ జోహార్ ఆ సినిమాను త‌న బేన‌ర్ మీద హిందీలో రిలీజ్ చేస్తే మంచి ఫ‌లితం వ‌స్తుంద‌ని భావిస్తున్నారు. మ‌రి క‌ర‌ణ్ ఆ ప‌ని చేస్తాడా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు