ఇద్ద‌రు కూతుళ్ల మ‌ధ్య తేడా చెప్పిన శ్రీదేవి

ఇద్ద‌రు కూతుళ్ల మ‌ధ్య తేడా చెప్పిన శ్రీదేవి

ఏజ్ పెరిగినా గ్రేస్ ఎంత‌కూ త‌గ్గ‌ని అందం అతిలోక సుంద‌రి ట్యాగ్ లైన్ ఉన్న శ్రీదేవిది. కాస్త గ్యాప్ తో.. తాజాగా మామ్ పేరుతో వ‌స్తున్న ఆమె మూవీ త్వ‌ర‌లోనే థియేట‌ర్ల‌ను ట‌చ్ చేయ‌నుంది. సినిమా ప్ర‌మోష‌న్లో భాగంగా మీడియాతో మాట్లాడింది శ్రీదేవి. ఈ సంద‌ర్భంగా ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల్ని చెప్పుకొచ్చింది.

త‌న గురించి కాకుండా..ఈసారి త‌న ఇద్ద‌రు కూతుళ్ల గురించి చెప్ప‌ట‌మేకాదు.. ఇద్ద‌రి మైండ్ సెట్స్ మొద‌లు.. వారిద్ద‌రి బిహేవియ‌ర్ గురించి ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట్లు చెప్పింది.

పెద్ద కూతురు జాహ్న‌విది చాలావ‌ర‌కూ త‌నలాంటి మైండ్ సెట్టేన‌ని.. నెమ్మ‌ద‌స్తురాల‌ని చెప్పింది.  ఆమేం చేసినా.. తాను ప‌క్క‌న ఉండాల‌ని.. కానీ చిన్న‌కుమార్తె ఖుషి మాత్రం కాస్త భిన్న‌మంది. చిన్న‌దే అయినా.. సొంతంగా త‌న ప‌నుల‌న్నీ తాను చేసుకుంటుందంది.

పెద్ద కూతురు జాహ్న‌వి వ‌య‌సు పెరుగుతున్నా.. తాను ప‌క్క‌నే ఉండాల‌ని.. ఒక్కోసారి తానే తినిపించాల్సి ఉంటుందంది. చిన్న‌పిల్ల‌లా త‌న‌ను ప‌డుకోబెట్ట‌మ‌ని అడుగుతుంద‌ని.. ఖుషి మాత్రం ఇండిపెండెంట్ గా త‌న ప‌నుల‌న్నీ తానే చేసేసుకుంటుంద‌ని చెప్పింది. జాహ్న‌వి సినిమాల్లోకి రావాల‌ని అనుకుంటుంద‌ని.. పిల్ల‌ల ఇష్ట‌మే త‌మ ఇష్ట‌మ‌న్న శ్రీదేవి.. తాను సినిమాల్లోకి వ‌స్తానంటే త‌న త‌ల్లి త‌న‌ను స‌పోర్ట్ చేసింద‌ని.. త‌న పిల్ల‌ల విష‌యంలో.. త‌న త‌ల్లిని ఫాలో అవుతాన‌ని చెప్పింది సీనియ‌ర్ శ్రీదేవి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English