అన్నకు హిట్లిచ్చిన దర్శకుడిని నమ్ముకున్న తమ్ముడు!

అన్నకు హిట్లిచ్చిన దర్శకుడిని నమ్ముకున్న తమ్ముడు!

'అవారా' సినిమాతో తెలుగువారి మది దోచిన హీరో కార్తీకి ఈ మధ్య హిట్లేమీ లేవు. సొంత భాష సంగతి ఏమిటో కానీ.. ఈ మధ్య కార్తీ సినిమాలు తెలుగులో అంతబాగా ఏమీ ఆడటం లేదు. అసలు కార్తీకి తెలుగులో చెప్పుకోదగిన హిట్ ఏదైనా ఉంటే.. అది ఆవారా మాత్రమే. ఆ తర్వాత వచ్చిన సినిమాలన్నీ ఫెయిల్యూర్ అవ్వడంతో.. ఇప్పుడు తెలుగు జనాలుకార్తీని దాదాపుగా మరచిపోయారు. ఇక తమిళంలో కూడా దగ్గదగ్గరగా ఇలాగే ఉంది ఈ హీరో పరిస్థితి. ఈ నేపథ్యంలో మనోడు 'బిరియానీ' అనే సినిమాపై చాలా ఆశలను పెట్టుకున్నాడు. అది సంక్రాంతికి విడుద అవుతుందని సమాచారం.

మరి ఆ సినిమా పరిస్థితి ఏమిటో ఇప్పుడప్పుడే తేలే అవకాశం లేదు. అందుకేనేమో ఈ లోపు కొత్త సినిమాల గురించి కథా చర్చల్లో బిజీగా ఉన్నాడు కార్తీ. ఈ సారి హీరో దర్శకుడు హరిని నమ్ముకున్నాడు. ఈ హరి ఓవరో కాదు.. గతంలో సూర్యతో సింగం, సింగం-2 వంటి సినిమాలు రూపొందించిన దర్శకుడు. సింగం సినిమా సూర్య కెరీర్ లో ఒకానొక మంచి హిట్ గా నిలిచింది. సింగం-2 పర్వాలేదనిపించుకుంది. సూర్యకు హరితో చాలా అనుబంధమే ఉంది. గతంలో ఈ హీరో-దర్శకుడి కాంబినేషన్ లో ఆరు అనే సినిమా కూడా వచ్చింది.

మరి అన్నకు బాగా దగ్గరవాడు అయిన ఈ దర్శకుడితో ఒక సినిమా చేయాలని భావిస్తున్నాడు కార్తీ. ఈ విషయంలో సూర్యకూడా చొరవచూపడంతో.. త్వరలోనే కార్తీ-హరి కాంబినేషన్ లో సినిమా మొదలుకాబతోందని తెలుస్తోంది. మరి అన్నకు హిట్లిచ్చిన దర్శకుడితో ఈ తమ్ముడు చేసే ప్రయత్నాలు ఏ మేరకు సఫలం అవుతాయో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English