ప్రభాస్ కోసం పవన్ విలన్ మళ్లీ వచ్చాడు

ప్రభాస్ కోసం పవన్ విలన్ మళ్లీ వచ్చాడు

‘బాహుబలి’తో నేషనల్ లెవెల్లో పాపులర్ అయిపోయాడు ప్రభాస్. ‘ది బిగినింగ్’ అతడికి తిరుగులేని పేరు తెచ్చిపెట్టింది. వేరే భాషల వాళ్లు కూడా అతణ్ని ఓన్ చేసుకుంటున్నారిప్పుడు. ‘బాహుబలి: ది బిగినింగ్’ను డబ్ చేసి రిలీజ్ చేసినపుడు ఆయా భాషల్లో అతడికి ఎవరు డబ్బింగ్ చెప్పారో జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు ఆ వివరాలన్నీ తెలుసుకుంటున్నారు. హిందీలో ప్రభాస్ పాత్రకు శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పిన సంగతి అప్పుడు చాలామందికి తెలియదు. ఐతే ఇప్పుడు రెండో భాగానికి కూడా అతనే డబ్బింగ్ చెబుతూ అందరి కళ్లలో పడుతున్నాడు.

‘బాహుబలి’లో ప్రభాస్ పాత్రకు శరద్‌తో డబ్బింగ్ చెప్పించిన అనంతరం ఒక ఫొటో దిగాడు రాజమౌళి. ఈ ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుని మురిసిపోయాడు శరద్. తొలి భాగానికి శరద్ వాయిస్ ఇచ్చినపుడు అతను మన ప్రేక్షకులకు పరిచయం లేదు. కానీ ‘బాహుబలి: ది బిగినింగ్’ విడుదలయ్యాక వచ్చిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’తో అతను మన ప్రేక్షకుల్లోనూ పాపులారిటీ సంపాదించుకున్నాడు. ‘సర్దార్’ ఫ్లాప్ అయినా.. శరద్ మాత్రం మన ప్రేక్షకుల్లో బాగానే రిజిస్టరయ్యాడు. ఐతే ‘సర్దార్’ తర్వాత అతడికి తెలుగులో అవకాశాలేమీ రాలేదు. ఈ సంగతలా వదిలేస్తే ప్రస్తుతం ‘బాహుబలి: ది కంక్లూజన్’ పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు వచ్చాయి. ఈ నెల 15న ‘ది కంక్లూజన్’ ట్రైలర్‌ను లాంచ్ చేయబోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు