బాహుబలి నుంచి ప్రభాస్ విడుదల.. 200 కోట్లతో కొత్త సినిమా

బాహుబలి నుంచి ప్రభాస్ విడుదల.. 200 కోట్లతో కొత్త సినిమా

సుదీర్ఘ షెడ్యూల్ తరువాత ఎట్టకేలకు బాహుబలి షూటింగ్ కంప్లీట్ అయింది. డిసెంబర్ మూడో వారానికే పూర్తి కావాల్సి ఉన్నా అనివార్య కారణాల వల్ల కాస్త ఆలస్యమైంది. ఒకేరోజు ప్రభాస్ పార్ట్ పూర్తిచేయడంతో పాటు సినిమా షూటింగ్ కూడా కంప్లీట్ చేశారు. ప్రభాాస్, దర్శకుడు రాజమౌళి కలిసి గుమ్మడికాయ కొట్టారు. దీంతో యూనిట్ తో అంతా పండగ చేసుకున్నారు. గుమ్మడికాయ కొట్టిన వీడియోను ప్రభాస్ షేర్ చేశాడు. కొత్తగా 200 కోట్ల భారీ బడ్జెట్ సినిమాలో నటించబోతున్నాడు.

బాహుబలి రెండు భాగాలు కలిపి సరిగ్గా 613 రోజులు షూటింగ్ పూర్తిచేసుకుందని ప్రకటించిన జక్కన్న.. ఇన్ని రోజులు తనకు సహకరించిన ప్రభాస్ కు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపాడు. అటు ప్రభాస్ అయితే, ఈ సినిమా కోసం ఏకంగా మూడున్నరేళ్లు కష్టపడ్డాడు. ఒక దశలో బరువు పెరిగి, మరోసారి బరువు తగ్గి.. సినిమా కోసం రకరకాలుగా కష్టపడ్డాడు. బాహుబలి-2 ఏప్రిల్ 28న విడుదలకానుంది.

కాగా బాహుబలి ప్రభాస్ కెరీర్ ను పూర్తిగా మార్చేసింది. ఇంటర్నేషనల్ గా గుర్తింపు తెచ్చింది. హిందీలో కరణ్ జోహార్ వంటి దర్శక నిర్మాత ఈ చిత్రాన్ని తీసుకుని రిలీజ్ చేయడంలో బాలీవుడ్ లో ఒక రేంజ్ సక్సెస్ కొట్టింది. బాహుబలి సినిమా నుంచి ప్రభాస్ విడుదల కావడంతో..తన తదుపరి ప్రాజెక్ట్ ను త్వరలో ప్రారంభించే పనిలో వున్నాడు. గతంలో రన్ రాజా రన్ వంటి చిత్రం చేసిన సుజిత్ డైరెక్షన్ లో తెలుగు, తమిళ్, హింది లాంగ్వెజెస్ లో కలిపి 200 కోట్ల బడ్జెట్ తో చిత్రం చేసే ప్లాన్ చేస్తున్నారని టాక్. ప్రభాస్ క్లోజ్ ఫ్రెండ్స్ ఈ త్రి భాషా చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తారని కూడ ఫిల్మ్ నగర్ లో సమాచారం వినిపిస్తుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు