ఫ్లాప్ హీరో పైకి లేస్తాడా?

ఫ్లాప్ హీరో పైకి లేస్తాడా?

బ్యాగ్రౌండ్ ఉన్నంత మాత్రాన అందరూ సినిమాల్లో నిలదొక్కుకుంటారు అనడానికి వీల్లేదు. అందుకు పూరి జగన్నాథ్ తమ్ముడు సాయిరాం శంకర్ సరైన ఉదాహరణ. అన్నయ్య అంత పెద్ద దర్శకుడైనా.. స్వయంగా ఆయనే అతణ్ని హీరోలా లాంచ్ చేసినా.. అతడి కోసం సినిమాలు నిర్మించినా.. హీరోగా నిలబడలేకపోయాడు సాయిరాం. 'బంపర్ ఆఫర్' తర్వాత అతడి సినిమాలన్నీ పల్టీ కొట్టేశాయి. ఇప్పుడు అతడి సినిమాలు వస్తున్న సంగతి కూడా జనాలకు తెలియట్లేదు. 'అరకు రోడ్‌లో' పరిస్థితి కూడా దాదాపు ఇంతే. ఎప్పుడో పూర్తయిన ఈ సినిమాను.. పెద్ద నోట్ల రద్దుతో పేరున్న సినిమాలన్నీ పక్కకు తప్పుకుంటున్న టైంలో కొంచెం ఖాళీ దొరికిందని డిసెంబరు 2న రిలీజ్ చేసేస్తున్నారు.

'అరకు రోడ్‌లో' ఒక థ్రిల్లర్ మూవీ. వాసుదేవ్ దర్శకత్వం వహించాడు. దీని ట్రైలర్ చూస్తే ఆసక్తికరంగానే ఉంది. అరకు రోడ్‌లో ఒక చోట లారీలు మాయమవుతుంటాయి. అందులోని మనుషులు చచ్చిపోతుంటారు. దాని వెనుక మిస్టరీని హీరో ఛేదిస్తాడు. ఇది నిజ జీవిత ఘటనల ఆధారంగా తీసిన సినిమా అంటున్నాడు దర్శకుడు. ఇందులో పెళ్లికాని ప్రసాద్ టైపు క్యారెక్టర్ చేస్తున్నాడు సాయిరాం శంకర్. అతడి సరసన 'పులి' పిల్ల నికీషా పటేల్ కథానాయికగా నటిస్తోంది. ఏస్ కమెడియన్ పృథ్వీతో పాటు కమల్ కామరాజు, అభిమన్యు సింగ్ కీలక పాత్రలు చేస్తున్నారు. ఈ వీకెండ్లో డబ్బింగ్ సినిమాలు బేతాళుడు, మన్యం పులిలతో పోటీ పడుతోంది 'అరుకు రోడ్‌లో'. మరి వరుస ఫ్లాపుల నుంచి బయటపడి ఈసారైనా సాయిరాం శంకర్ సక్సెస్ రుచి చూస్తాడేమో చూద్దాం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English