కళ్యాణ్ రామ్ తెలివైన పనే చేశాడు

కళ్యాణ్ రామ్ తెలివైన పనే చేశాడు

నందమూరి కళ్యాణ్ రామ్‌ను చూస్తే చాలా మందికి అయ్యో అనిపిస్తుంటుంది. ఎందుకంటే 13 ఏళ్ల కెరీర్లో అతడికి దక్కినవి రెండే రెండు హిట్లు. వాటి వల్ల కూడా కళ్యాణ్ రామ్ పెద్దగా సొమ్ము చేసుకున్నది లేదు. చాలా వరకు సొంత బేనర్లోనే సినిమాలు చేస్తూ వస్తున్న కళ్యాణ్ రామ్.. తన హిట్ సినిమాలు అతనొక్కడే, పటాస్‌లతో అందుకున్న లాభాల కంటే ఫ్లాపుల వల్ల దాని కంటే ఎన్నో రెట్లు నష్టాలు మూటగట్టుకున్నాడు. అందులోనూ ‘ఓం త్రీడీ’ సినిమా కొట్టిన దెబ్బ అలాంటిలాంటిది కాదు. ఆ సినిమా కళ్యాణ్‌ను నిలువునా ముంచేసింది. ఆ దెబ్బకు ‘పటాస్’ను చాలా తక్కువ బడ్జెట్లో ముగించాడు కళ్యాణ్. కానీ ఆ చిత్రాన్ని విడుదలకు ముందే హోల్‌సేల్‌గా అమ్మేయడం వల్ల కళ్యాణ్ రామ్‌కు పెద్దగా మిగిలిందేమీ లేకపోయింది.

ఇక లేటెస్టుగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో సొంత బేనర్లో ‘ఇజం’ చేశాడు కళ్యాణ్ రామ్. ఈ చిత్రానికి పాతిక కోట్ల దాకా ఖర్చయినట్లు వార్తలొచ్చాయి. ఐతే సినిమాకు పాజిటివ్ బజ్ ఉండటం వల్ల కళ్యాణ్ రామ్ మార్కెట్ వాల్యూకి మించి రూ.20 కోట్ల దాకా బిజినెస్ జరిగింది. డెఫిషిట్ పడ్డా సరే.. ఈ సినిమా విషయంలో కళ్యాణ్ రామ్ లక్కీనే అని చెప్పాలి. లాభాలు వచ్చినా.. నష్టాలు వచ్చినా నో రిటర్న్స్ పాలసీతో అమ్మకాలు జరిపాడు కళ్యాణ్ రామ్. దీని వల్ల రిజల్ట్ ఎలా ఉన్నా అతడికి ఏ సంబంధం ఉండదన్నమాట. ఇందుకోసం బడ్జెట్ రికవరీ రాకపోయినా కంగారు పడలేదు కళ్యాణ్ రామ్. ఇప్పుడు సినిమాకు నెగెటివ్ టాక్ వచ్చింది. ఫైనల్ షేర్ రూ.15 కోట్లకు చేరడం కూడా అసాధ్యంలాగే కనిపిస్తోంది. నష్టాలన్నీ బయ్యర్లే భరించాలి. కళ్యాణ్ రామ్ కు సంబంధం లేదు. శాటిలైట్ రైట్స్ ఇంకా కళ్యాణ్ రామ్ చేతుల్లోనే ఉన్నాయి కాబట్టి ఓ రెండు మూడు కోట్లకైనా గిట్టుబాటు కావచ్చనుకుంటున్నాడు. కాబట్టి 2-3 కోట్ల స్వల్ప నష్టాలతో బయటపడ్డట్లే అన్నమాట. మొత్తానికి ‘ఇజం’ బిజినెస్ విషయంలో కళ్యాణ్ రామ్ తెలివైన పనే చేశాడనుకోవాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు