ప్రేమమ్.. ఇంకో మూడు కోట్లొస్తే చాలు

 ప్రేమమ్.. ఇంకో మూడు కోట్లొస్తే చాలు

ద‌స‌రా మూవీ ‘ప్రేమ‌మ్’ సంద‌డి ఇంకా కొన‌సాగుతోంది. ఈ సినిమా రెండో వీకెండ్లోనూ అద‌ర‌గొట్టింది. ఐతే ‘ప్రేమ‌మ్ ఇంకా బ్రేక్ ఈవెన్ కు మాత్రం రాలేదు. ఎందుకంటే మంచి అంచ‌నాలుండ‌టంతో ఈ సినిమాకు బిజినెస్ కూడా బాగానే జ‌రిగింది. నాగ‌చైత‌న్య సోలో హీరోగా న‌టించిన సినిమాలో అత్య‌ధిక బిజినెస్ చేసిన చిత్ర‌మిదే. థియేట్రిక‌ల్ రైట్స్ .. ప‌బ్లిసిటీ ఇత‌ర ఖ‌ర్చులు క‌లిపితే లెక్క రూ.23 కోట్లు తేలింది. ఆ మొత్తం వ‌సూలైతేనే బ్రేక్ ఈవెన్ అన్న‌మాట‌.

ఐతే ‘ప్రేమమ్’ ఊపు చూస్తుంటే అదేమంత పెద్ద విష‌యం కాదు. రెండో వీకెండ్ ముగిసేస‌రికి ‘ప్రేమ‌మ్’ రూ.20 కోట్ల దాకా షేర్ క‌లెక్ట్ చేయ‌డం విశేషం. అంటే ఇంకో మూడు కోట్లు వ‌స్తే బ‌య్య‌ర్లంద‌రూ సేఫ్ పొజిష‌న్ కు వ‌చ్చేస్తార‌న్న‌మాట‌. ఈ వీకెండ్లో ‘ఇజం’ వ‌స్తున్న‌ప్పటికీ ‘ప్రేమ‌మ్’ కూడా మంచి వ‌సూళ్లే రాబ‌ట్టుకునే అవ‌కాశ‌ముంది. కాబ‌ట్టి ‘ప్రేమ‌మ్ రూ.25 కోట్ల షేర్ మార్కును అందుకోవ‌డం.. బ‌య్య‌ర్లు లాభాల బాట ప‌ట్ట‌డం ఖాయం.

ఇక రెండో వారాంతం ముగిసేస‌రికి ‘ప్రేమ‌మ్’ క‌లెక్ష‌న్ల బ్రేక‌ప్ విష‌యానికి వ‌స్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.15 కోట్ల దాకా షేర్.. రూ.21.5 కోట్ల గ్రాస్ వసూలైంది. అమెరికాలో దాదాపు 8 ల‌క్ష‌ల డాల‌ర్ల గ్రాస్ క‌లెక్ట్ అయింది. క‌ర్ణాట‌క‌లో రూ.2 కోట్ల దాకా షేర్.. రూ.4 కోట్ల దాకా గ్రాస్ వ‌చ్చింది. మొత్తంగా వ‌ర‌ల్డ్ వైడ్ రూ.32 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూలు చేసి అద‌ర‌గొట్టింది ‘ప్రేమ‌మ్‌’.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English