పాత బంధాల గురించి చైతూకు తెలుసు-స‌మంత‌

పాత బంధాల గురించి చైతూకు తెలుసు-స‌మంత‌

ఒక హీరో లేదా హీరోయిన్ పెళ్లికి క‌మిటైన‌పుడు వాళ్ల పాత రిలేష‌న్ షిప్స్ గుర్తుకు రావ‌డం స‌హ‌జం. ముఖ్యంగా హీరోయిన్ల విష‌యంలో ఈ డిస్క‌ష‌న్స్ ఎక్కువ న‌డుస్తుంటాయి. కానీ వాటి గురించి ఓపెన్ గా ఎవ‌రూ మాట్లాడ‌రు. హీరోయిన్లు కూడా ఎక్క‌డా దాని ప్ర‌స్తావ‌న తీసుకురారు. మీడియాకు ఇంట‌ర్వ్యూలిచ్చినా ఇలాంటి ప్ర‌శ్న‌లు అవాయిడ్ చేస్తారు. కానీ స‌మంత మాత్రం ఇందుకు మిన‌హాయింపు అని చెప్పాలి.

స‌మంత ఒక‌ప్పుడు సిద్ధార్థ్ తో ప్రేమ‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఐతే తాజాగా సౌత్ స్కోప్ మ్యాగ‌జైన్ కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో సిద్ధూ పేరెత్త‌కుండా అత‌డితో రిలేష‌న్ షిప్ గురించి వ్యాఖ్య‌లు చేసింది స‌మంత‌. త‌న గురించి చైతూకు.. చైతూ గురించి త‌న‌కు పూర్తిగా తెలుస‌ని చెబుతూ ఈ వ్యాఖ్య‌లు చేసిందామె.

''కొన్నేళ్లుగా చైతూ నా జీవితానికి సంబంధించిన ప్ర‌తి ముఖ్య‌మైన సంద‌ర్భంలోనూ తోడుగా ఉన్నాడు. నా వ్య‌క్తిగ‌త.. వృత్తిగ‌త జీవితాల్లో ఒడుదొడుకులు ఎదురైన సంద‌ర్భాల‌న్నింట్లో అత‌ను అండ‌గా నిలిచాడు. వేరే వ్య‌క్తుల‌తో నా బంధాలు సాగిన‌పుడు అత‌ను నాతో ఉన్నాడు. అలాగే అత‌ను వేరే వ్య‌క్తుల‌తో రిలేష‌న్ షిప్స్ లో ఉన్న‌పుడు నేను అత‌డి ప‌క్క‌నున్నాను. కాబ‌ట్టి మా ఇద్ద‌రికీ ఒక‌రి గురించి ఇంకొక‌రికి తెలియ‌ని విష‌య‌మంటూ ఏమీ లేదు'' అని స‌మంత సూటిగా.. సుత్తి లేకుండా చెప్పింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు