గౌతమి వెర్సస్ శ్రుతి.. నిజమా?

గౌతమి వెర్సస్ శ్రుతి.. నిజమా?

కమల్ హాసన్‌కు, గౌతమికి మధ్య బంధం గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోలేదు కానీ.. భార్యాభర్తల్లాగే ఉంటారు. సారిక నుంచి విడిపోయాక కొన్నేళ్లకే గౌతమితో ‘పేరు’ పెట్టలేని బంధం మొదలుపెట్టాడు కమల్. ఈ బంధాన్ని కమల్ కూతుళ్లు శ్రుతి హాసన్, అక్షర హాసన్ కూడా గౌరవిస్తారు. గౌతమి కూతురు సుబ్బులక్ష్మిని తన కూతురిలా భావిస్తాడు కమల్. అలాగే శ్రుతి, అక్షరలను తన బిడ్డలనుకుంటుంది గౌతమి. వీళ్లందరి మధ్య మంచి అండర్ స్టాండింగ్ ఉంటుంది. ఐతే తాజాగా గౌతమికి, శ్రుతి హాసన్‌కు మధ్య ఓ ప్రొఫెషనల్ గొడవ జరిగినట్లు చెన్నైలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

‘శభాష్ నాయుడు’ షూటింగ్ సందర్భంగా గౌతమికి, శ్రుతికి వాగ్వాదం జరిగిందట. కమల్ గత కొన్ని సినిమాలకు గౌతమినే కాస్ట్యూమ్ డిజైనర్. ‘శభాష్ నాయుడు’కు కూడా ఆ బాధ్యత ఆమే చూసుకుంటోంది. ఐతే ఈ సినిమా కోసం శ్రుతికి గౌతమి డిజైన్ చేసిన దుస్తులు ఆమెకు నచ్చలేదట. ఇవి వద్దని.. వేరేవి కావాలని శ్రుతి తిరస్కరించిందట. ఈ విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం కూడా చోటు చేసుకుందని.. అప్పట్నుంచి ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారని సమాచారం. కమల్ ప్రమాదానికి గురై.. గౌతమి, శ్రుతి సినిమా కోసం ప్రిపరేషన్లో ఉండగా ఈ గొడవ జరిగిందట. ఈ గొడవ చెన్నై జనాలకు మంచి కాలక్షేపం అవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English