మంచు విష్ణు ఎంత అదృష్టవంతుడో..

మంచు విష్ణు ఎంత అదృష్టవంతుడో..

‘ఈడోర‌కం ఆడోర‌కం’ సినిమాతో చాన్నాళ్ల త‌ర్వాత ఓ హిట్టు అందుకున్నాడు మంచు విష్ణు. ఈ ఊపులో వ‌రుస‌గా సినిమాలు లైన్లో పెట్టేస్తున్నాడు.  ‘అడ్డా’ ఫేమ్ కార్తీక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో ‘స‌ర‌దా’ అనే సినిమాను పూర్తి చేస్తున్న విష్ణు.. త‌న తండ్రి మోహ‌న్ బాబు కాంబినేష‌న్లో ‘సేనాప‌తి’ అనే సినిమాను తెర‌మీదికి తెస్తున్న సంగ‌తి తెలిసిందే. దీంతో పాటు లేటెస్టుగా ల‌క్కున్నోడు అంటూ ఇంకో సినిమా చేయ‌బోతున్నాడు విష్ణు. ‘గీతాంజ‌లి’ ఫేమ్ రాజ్ కిర‌ణ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తాడు. ఇది ‘దేనికైనా రెడీ’ త‌ర‌హాలో కామెడీ ఎంట‌ర్టైన‌ర్ అని స‌మాచారం. విష్ణునే ఈ చిత్రాన్ని నిర్మించే అవ‌కాశాలున్నాయి.

హిట్ ఫార్ములా హార్ర‌ర్ కామెడీ ప్ర‌కారం ‘గీతాంజ‌లి’ సినిమా తీసి స‌క్సెస్ ఫుల్ డెబ్యూ డైరెక్ట‌ర్ అనిపించుకున్న రాజ్ కిర‌ణ్‌.. రెండో సినిమా ‘త్రిపుర‌’తో దెబ్బ తిన్నాడు. ఈ హార్ర‌ర్ థ్రిల్ల‌ర్ పై విమ‌ర్శ‌లొచ్చాయి. దీంతో ఈసారి ఎంట‌ర్టైన్మెంట్ బాట ప‌డుతున్నాడ‌త‌ను. మంచు విష్ణుకు ఈ స్క్రిప్టు బాగా న‌చ్చి త‌నే ప్రొడ్యూస్ చేయ‌డానికి ముందుకొచ్చాడ‌ట‌. ఇంకో రెండు నెల‌ల త‌ర్వాతే ఈ చిత్రం సెట్స్ మీదికి వెళ్లే అవ‌కాశ‌ముంది. కార్తీక్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో విష్ణు చేస్తున్న ‘స‌ర‌దా’ దాదాపు పూర్తికావ‌చ్చింది. ఈ చిత్రంలో విష్ణు స‌ర‌స‌న సోనారికా బ‌డోరియా న‌టిస్తోంది. వీళ్లిద్ద‌రూ ‘ఈడోర‌కం ఆడోర‌కం’లో జంట‌గా క‌నిపించి స‌క్సెస్ ఫుల్ పెయిర్ అనిపించుకున్నారు. అక్టోబ‌ర్లో ఈ చిత్రం ప్రేక్ష‌కుల ముందుకొస్తుంది.