టీవీ యాంకర్‌తో హీరోగారి సహ జీవనం

టీవీ యాంకర్‌తో హీరోగారి సహ జీవనం

సహ జీవనం అనేది ఒకప్పుడు సర్‌ప్రైజింగ్‌ మేటర్‌ కానీ ఇప్పుడు అర్బన్‌ సర్కిల్స్‌లో, ముఖ్యంగా సెలబ్రిటీ వర్గాల్లో చాలా కామన్‌ అయిపోయింది. సహజీవనం అంటే పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో ఉంటూ భార్యాభర్తల్లానే అన్నీ పంచుకుంటారన్నమాట. పెళ్లి కాలేదు కాబట్టి ఎలాంటి లీగల్‌ పరమైన కమిట్‌మెంట్లు ఉండవు. నచ్చకపోతే ఎప్పుడంటే అప్పుడు చెరో దారీ చూసుకోవచ్చు. పాశ్చాత్య దేశాల్లో ఇది చాలా సాధారణ విషయం. ఇప్పుడు విశ్వ నగరాల వరకు ఇండియాలోను ఇది మామూలైపోతోంది. ఇంతకీ ఇప్పుడు విషయం ఏమిటంటే ఒక యువ హీరో ఓ టీవీ యాంకర్‌తో సహ జీవనం చేస్తున్నాడని ఫిలింనగర్‌ కోడై కూస్తోంది. ఆ అమ్మడు టీవీ షోలతో పాటు సినిమాల్లోను క్యారెక్టర్‌ పాత్రలు చేస్తూ బిజీగానే వుంది. ఈ హీరో మాత్రం మొదట్లో విజయాలు సాధించి, అవకాశాలు పొందాడు కానీ తర్వాత కాలం కలిసి రాక ఖాళీ అయిపోయాడు.

స్ట్రగులింగ్‌ దశలో వున్నా కానీ అతడిపై వున్న అభిమానం ఆమెకి ఏమాత్రం తగ్గలేదు. ఇద్దరి మధ్య ప్రేమ ముదిరి ఇప్పుడు సహ జీవనం వరకు వెళ్లింది. అన్నీ ఓకే అనుకుంటే తొందర్లో పెళ్లి కూడా చేసుకుంటారట. తన ప్రియుడికి అవకాశాలు ఇమ్మని ప్రస్తుతం ఆమె తనకి తెలిసిన వారందరికీ సిఫార్సు చేస్తోందట. నిన్న మొన్నటి వరకు హీరో వేషాలే వేయాలని ఫిక్స్‌ అయిన అతను ఇప్పుడు ఎలాంటి పాత్రలిచ్చినా చేయడానికి సిద్ధమంటున్నాడట. ఇంతకీ వాళ్లిద్దరెవరనేది మీకేమైనా క్లూ దొరికిందా లేదా? కనిపెడితే కింద కామెంట్‌ సెక్షన్‌లో చెలరేగి పోండిక.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు