బెంగళూరు హోటళ్లలో కబాలీకి నో

బెంగళూరు హోటళ్లలో కబాలీకి నో

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కబాలీ క్రేజ్ ఎంతగా ఉందో చెప్పాల్సిన అవసరమే లేదు. గడిచిన కొద్ది రోజుల్లో పీక్స్ కు చేరిపోయిన కబాలీ ప్రచారం పుణ్యమా అని ప్రముఖ దినపత్రికలో ఈ సినిమాకు సంబంధించిన సమాచారం మొదటి పేజీలో అచ్చేసుకునే పరిస్థితి. ఇదిలా ఉంటే.. ఈ సినిమా క్రేజ్ ను వీలైనంత సొమ్ము చేసుకోవటం కోసం కర్ణాటకలోని పలు హోటళ్లు చేస్తున్న ప్రయత్నాలకు తాజాగా గండి పడింది.

బెంగళూరులోని పలు హోటళ్లలో ప్రత్యేకంగా కబాలీన సినిమా షో వేయాలని నిర్ణయించారు. ఇందుకోసం ప్యాకేజీలు కూడా సిద్ధం చేశారు. అయితే.. స్టార్ట్ హోటళ్లలో కబాలీ చిత్రప్రదర్శన సరికాదని.. అలాంటివి రద్దు చేయాలంటూ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అభ్యంతరం వ్యక్తం చేసింది. హోటళ్లలో సినిమాల్ని ప్రదర్శించటం సినిమాటోగ్రఫీ చట్టానికి వ్యతిరేమన్న విషయాన్ని గుర్తించటంతో ఈ చర్య తీసుకున్నారు.

దీంతో.. కబాలీ క్రేజ్ తో ప్యాకేజీల పేరుతో బుకింగ్ లు జరిపిన హోటళ్లు.. కబాలీ షోను క్యాన్సిల్ చేసి.. వారికి తిరిగి డబ్బులు ఇచ్చేస్తున్నాయి. సినిమా థియేటర్లో కాకున్నా ఎక్కడో ఒక చోట మొదటి రోజునే కబాలి మూవీని చూసే ఛాన్స్ దక్కిందని సంబరపడిన వారంతా నిరాశకు గురయ్యే పరిస్థితి. ఈ నిర్ణయం ఏదో నాలుగైదు రోజుల ముందే తీసుకుంటే.. తమ ప్రయత్నం తాము చేసుకునే వాళ్లం కదా? అని పలువురు మండిపడుతున్న పరిస్థితి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English