శ్రీనివాస్‌ రెడ్డిని తొక్కేస్తున్నారుగా..!

శ్రీనివాస్‌ రెడ్డిని తొక్కేస్తున్నారుగా..!

శ్రీనివాస్‌ రెడ్డి.. ఇండస్ట్రీలో 14 ఏళ్లుగా ఉన్నాడు. ఎప్పట్నుంచో కామెడీ వేషాలు వేసుకుంటున్నా.. ఈ మధ్యే కొన్ని సినిమాలతో బాగా పాపులర్‌ అయ్యాడు. పటాస్‌, గీతాంజలి లాంటి సినిమాల్లో ఫుల్‌ లెంత్‌ రోల్స్‌ చేసి పేరు తెచ్చుకున్నాడు. తనదైన శైలిలో నవ్వులతో ముంచెత్తగలడు ఈ కమెడియన్‌. గతేడాది పటాస్‌ లో ఈయన కామెడికి థియేటర్స్‌ అన్నీ నవ్వులతో హోరెత్తిపోయాయి. ఈ సినిమాలో శ్రీను కామెడీకి గానూ కచ్చితంగా అవార్డులు వస్తాయనే అనుకుంటున్నారంతా. కానీ ఈ నటున్ని మాత్రం ప్రతీసారి తొక్కేస్తూనే ఉన్నారు. కనీసం కాంప్లిమెంటరీ గా కూడా జ్యూరీ ఇవ్వలేదు.

మొన్న నంది అవార్డుల్లో.. నిన్న ఫిల్మ్‌ ఫేర్‌ అవార్డుల్లో.. నేడు సైమా అవార్డుల్లో.. అన్ని చోట్లా శ్రీనివాస్‌ రెడ్డికి మొండిచెయ్యే కనిపించింది. ఎక్కడా మనోడికి ఒక్క అవార్డ్‌ కూడా రాలేదు. నంది, సైమా అవార్డులు వెన్నెల కిషోర్‌ కు ఇచ్చారు. భలేభలే మగాడివోయ్‌ లో ఈయన కడుపుబ్బా నవ్వించాడట.. అందుకే ఈయనకు పిలిచి మరీ అవార్డ్‌ ఇచ్చారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే భలేభలే సినిమాలో ఇంటర్వెల్‌ కు కానీ వెన్నెల కిషోర్‌ ఎంట్రీ ఉండదు.. కానీ పటాస్‌ లో సినిమా అంతా నవ్వించాడు శ్రీనివాస్‌ రెడ్డి. అతన్ని కాదని వెన్నెల కిషోర్‌ కు ఈ అవార్డ్‌ రావడం నిజంగానే కాస్త ఆలోచించదగ్గదే. ఏదేమైనా.. పటాస్‌ లాంటి సినిమాలో ఇంతగా నవ్వించిన శ్రీనివాస్‌ రెడ్డిని కాదని మరొకరికి అవార్డివ్వడం కాస్త బాధించే విషయమే.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు