కోట్లు వదిలేస్తున్న రవితేజ

కోట్లు వదిలేస్తున్న రవితేజ

ఇంతకుముందు రవితేజ వ్యవహారం చూస్తే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకుంటున్నట్లుగా ఉండేది. స్టార్ హీరోల్లో అందరికంటే వేగంగా పని చేసే కథానాయకుడిగా ముందు రవితేజ పేరే చెప్పేవాళ్లు. ఏడాదికి రెండు మూడు సినిమాలు రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుని శరవేగంగా సినిమాలు చేస్తూ పోయాడు. ఐతే వేగం పెరిగి.. క్వాలిటీ తగ్గిపోవడంతో ఓ దశలో వరుసగా సినిమాలు దెబ్బ తిన్నాయి. దీంతో రేసులో బాగా వెనకబడిపోయాడు మాస్ రాజా. ఈ దశలో ‘బలుపు’ మళ్లీ అతడి కెరీర్‌కు ఊపునిచ్చింది. అప్పటి నుంచి ఓ మోస్తరు వేగంతో సినిమాలు చేస్తున్నాడు. సినిమాలు పూర్తి చేయడంలో వేగం తగ్గించాడు కానీ.. ఒక సినిమాకు ఇంకో సినిమాకు గ్యాప్ లేకుండా మాత్రం చూసుకుంటున్నాడు రవితేజ.

కానీ గత ఏడాది ‘బెంగాల్ టైగర్’ విడుదలయ్యాక.. ఇప్పటిదాకా అతడి సినిమా ఏదీ మొదలవలేదు. నిజానికి అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈపాటికి దిల్ రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ సినిమా ఈ పాటికి పూర్తికావచ్చేదేమో. కానీ పారితోషకం దగ్గర తేడా రావడంతో ఆ సినిమా నుంచి బయటికొచ్చేశాడు రవితేజ. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో సినిమాను త్వరగానే మొదలుపెడదామని చూశాడు కానీ.. ఇప్పటిదాకా అది పట్టాలెక్కలేదు. దీంతో రవితేజ కెరీర్లో విలువైన ఆర్నెల్లు వృథా అయిపోయాయి. కచ్చితంగా ఓ సినిమా పూర్తి చేసేసే టైం ఇది. అంటే ఒక ఫుల్ రెమ్యూనరేషన్ లాస్ అయిపోయాడన్నమాట మాస్ రాజా. ఇదేదో దిల్ రాజు దగ్గర కొంచెం రాజీ పడి ఉంటే పోయేదేమో అని ఇప్పుడు పశ్చాత్తాపపడుతూ ఉండి ఉంటాడేమో రవితేజ.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English