ఎస్‌.జె.సూర్య మతిపోగొట్టేస్తున్నాడు

ఎస్‌.జె.సూర్య మతిపోగొట్టేస్తున్నాడు

ఎస్‌.జె.సూర్య మనకింకా దర్శకుడిగానే గుర్తున్నాడు. కానీ తమిళ ప్రేక్షకులు అతణ్ని దర్శకుడిగా మరిచిపోయి చాలా కాలమైంది. కొన్నేళ్ల కిందటే అతడికి దర్శకత్వం సెకండరీ విషయం అయిపోయింది. నటుడిగా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీ అయిపోయాడు. అందులోనూ ఈ మధ్య 'ఇరైవి' అనే సినిమాలో తాగుబోతుగా మారిన సినీ దర్శకుడి పాత్రలో చితగ్గొట్టేశాడతను. మొత్తం ఇండస్ట్రీ అంతా అతడి నటన చూసి విస్తుబోయింది. ఈ సినిమా తర్వాత అగ్ర దర్శకులు చాలామంది అతడికి పాత్రలు ఆఫర్‌ చేస్తున్నారు. పవన్‌ సినిమా వదిలేసి వెళ్లిపోవడానికి కూడా కారణం అదే.

'ఇరైవి' సెట్స్‌ మీద ఉండగానే సెల్వ రాఘవన్‌ లాంటి విలక్షణ దర్శకుడు ఎస్‌.జె.సూర్య కథానాయకుడిగా 'నెంజం మరప్పదిల్లై' అనే రొమాంటిక్‌ హార్రర్‌ థ్రిల్లర్‌ మొదలుపెట్టడం విశేషం. ఆ సినిమా ఫస్ట్‌ పోస్టర్‌ నిన్నే రిలీజ్‌ చేశారు. విచిత్రమైన అవతారంలో సూర్య షాకిచ్చాడు ఆ పోస్టర్లో. ఇవాళ ఇంకో రెండు పోస్టర్లు వదిలాడు సెల్వ రాఘవన్‌. ఆ రెండు పోస్టర్లు కూడా చాలా వెరైటీగా ఉన్నాయి. రెండో పోస్టర్లో సూటేసుకుని చెక్కగుర్రం మీద కూర్చుని ఆడుతూ చిత్రంగా కనిపిస్తున్నాడు సూర్య. ఈ సినిమాలో రెజీనా కథానాయిక కావడం విశేషం. ఆమె పోస్టర్‌ కూడా ఒకటి రిలీజ్‌ చేశారు. అందులో ఆమె ముఖాన్ని సగమే చూపించారు. మొత్తానికి ఫస్ట్‌ పోస్టర్లతో సినిమా మీద బాగానే ఆసక్తి రేకెత్తించాడు సెల్వ. ఈ చిత్రం తెలుగులోనూ రిలీజయ్యే అవకాశముంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు