సమంతా.. ఒక్క కామెంట్ ప్లీజ్!

సమంతా.. ఒక్క కామెంట్ ప్లీజ్!

గౌతమ్ మీనన్.. సమంతకు గాడ్ ఫాదర్ లాంటి వాడు. ఇప్పుడు ఆమె అనుభవిస్తున్న స్టార్ డమ్ అంతా ఆయన పుణ్యమే. ‘ఏమాయ చేసావె’ అనే ఒకే ఒక్క సినిమాతో ఆమె రాతను మార్చేశాడు గౌతమ్. ఆ తర్వాత కూడా ‘ఎటో వెళ్లిపోయింది మనసు’ లాంటి మరో మంచి సినిమాలో నటించే అవకాశం కల్పించాడు. ఇక నాగచైతన్యతో సమంతకు ఉన్న ‘సినిమా’ బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తెలుగులో తన తొలి సినిమా ‘ఏమాయ చేసావె’లో అతనే హీరో. ఆ తర్వాత ‘మనం’ లాంటి మరో మెమొరబుల్ సినిమా చేసింది అతడితో. ఇంకా వీళ్లిద్దరి కాంబినేషన్లో ‘ఆటోనగర్ సూర్య’ కూడా వచ్చింది. మొత్తానికి దర్శకుడితో.. హీరోతో ఇద్దరితోనూ గొప్ప అనుబంధం ఉందామెకు.

మరి గౌతమ్ మీనన్-నాగచైతన్య కాంబినేషన్లో తెరరకెక్కిన కొత్త సినిమా ‘సాహసం శ్వాసగా సాగిపో’ గురించి సమంత ఒక్క మాటా మాట్లాడకపోవడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. అందులోనూ ఇది తనకు మెమొరబుల్ మూవీ అయిన ‘ఏమాయ చేసావె’కు సీక్వెల్ కాని సీక్వెల్. సమంత స్పందించడానికి ఇలా కూడా ఓ కారణం దొరికింది. ఇంతకుముందు టీజర్స్ రిలీజ్ చేసినా.. ట్రైలర్ వదిలినా.. లేటెస్టుగా ఆడియో కూడా బయటికి వచ్చినా సమంత రెస్పాండవలేదు. తన తోటి హీరో హీరోయిన్లు.. తనకు నచ్చిన దర్శకుల సినిమాలకు సంబంధించి ఏ విశేషాలు బయటికి వచ్చినా రెస్పాండయ్యే సమంత.. ఈ సినిమా గురించి మాత్రం ఒక్క ముక్కా మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించే విషయమే. దీనికి ఏదైనా ‘స్పెషల్’ రీజణ్ ఉందంటారా?

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు