జెంటిల్‌ మన్‌ దున్నేస్తున్నాడు బాబోయ్‌..!

జెంటిల్‌ మన్‌ దున్నేస్తున్నాడు బాబోయ్‌..!

అదృష్టం ఒక్కోసారి ఫెవీక్విక్‌ కంటే గట్టిగా పట్టుకుంటుంది. ఇప్పుడు నానికి అలాగే పట్టుకుంది మరి. ఎంతకీ వదలనంటుంది. భలేభలే మగాడివోయ్‌ తో నాని దశ మొత్తం తిరిగిపోయింది. ఇన్నాళ్ల సంగతేమో గానీ.. ఇప్పుడు నాని ఓ స్టార్‌. అసలు తన సినిమాలకు ఈ స్థాయిలో కలెక్షన్లు వస్తాయని నాని కూడా ఊహించి ఉండడేమో.

భలేభలే మగాడివోయ్‌ నుంచి నాని సినిమాలు ఓవర్సీస్‌ లో ఓవర్‌ గా ఆడేస్తున్నాయి. ఆ సినిమా అక్కడ 10 కోట్ల వరకు వసూలు చేసింది. ఇక కృష్ణగాడి వీర ప్రేమగాథ కూడా 6 కోట్లు వసూలు చేసింది. ఇప్పుడు జెంటిల్‌ మన్‌ సైతం రెండు రోజుల్లోనే 2 కోట్లకు పైగా వసూలు చేసింది.

ఇప్పుడు ఎక్కడ చూసినా జెంటిల్‌ మన్‌ థియేటర్స్‌ ముందు హౌజ్‌ ఫుల్‌ బోర్డ్స్‌ దర్శనమిస్తున్నాయి. నాని జోరు చూస్తుంటే మరో వారం పాటు రప్ఫాడించేలా కనిపిస్తున్నాడు. పైగా వచ్చే వారం నిహారిక ఒక మనసు తప్ప మరే సినిమాలు లేవు.

ఓవర్సీస్‌ లో అయితే జెంటిల్‌ మన్‌ జోరు చూస్తుంటే నాని ఖాతాలో మరో మిలియన్‌ డాలర్‌ సినిమా పడేలాగే ఉంది. ఓ పక్క రామ్‌ చరణ్‌ మిలియన్‌ డాలర్‌ అందుకోడానికి నానా తంటాలు పడుతుంటే.. నీళ్లు తాగినంత ఈజీగా నాని మిలియన్‌ మార్క్‌ వైపు అడుగులు వేస్తున్నాడు. మొత్తానికి జెంటిల్‌ మన్‌ సక్సెస్‌ తో నాని రేంజ్‌ మారిపోయింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు