మహేష్‌ స్టయిల్లో తారక్‌ సొంత డప్పు

మహేష్‌ స్టయిల్లో తారక్‌ సొంత డప్పు

ఈ రోజుల్లో ఎవరి డప్పు వాళ్లే కొట్టుకోవాలని పూరీ జగన్నాథ్‌ అన్నాడంటే అందులో చాలా లోతుంది. పబ్లిక్‌ తమ టాపిక్‌ మీదినుంచి డైవర్ట్‌ అయిపోవడానికి చాలా వ్యాపకాలున్నాయిప్పుడు. అందుకే సూపర్‌స్టార్‌ అయినా సరే పీఆర్‌ టీమ్‌ మెయింటైన్‌ చేస్తూ నిత్యం వార్తల్లో ఉండాలి. బాలీవుడ్‌లో ఇప్పటికే ఈ పద్ధతి బాగా ముదిరిపోయింది. ఇప్పుడు టాలీవుడ్‌ హీరోలు కూడా పీఆర్‌ కోసమని ప్రత్యేకంగా ఖర్చు పెడుతున్నారు. ఈ విషయంలో మన హీరోల్లో మహేష్‌తో పోటీ రాగలిగే హీరో ఇంకెవరూ లేరంటారు.

ఇంతకాలం ఇలాంటి విషయాలని అంతగా పట్టించుకోకుండా వదిలేసిన తారక్‌ ఇప్పుడు తీరు మార్చాడు. తనకి సంబంధించిన చిన్న విషయాన్ని కూడా దండోరా వేయించేట్టుగా ఒక సొంత టీమ్‌ని సిద్ధం చేసాడు. దీంతో తారక్‌ ఏం చేస్తున్నాడు, ఎలా వున్నాడు, ఎక్కడున్నాడు వగైరా విషయాలు ఎప్పటికప్పుడు ఫాన్స్‌కి అందుతున్నాయి. నాన్నకు ప్రేమతో రిలీజ్‌కి ముందు మీడియాని కలిసి విందు ఇచ్చాడంటే కూడా ఇదే కారణం మరి. ప్రస్తుతం స్టేట్‌ లెవల్లో పీఆర్‌ మెయింటైన్‌ చేస్తోన్న ఎన్టీఆర్‌ ముందు ముందు నేషనల్‌ లెవల్‌లో దూసుకెళ్తాడంట. బ్రాండ్‌ అండార్స్‌మెంట్ల పరంగా కూడా తారక్‌ ఇప్పుడు స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ చూపిస్తున్నాడట. వీళ్లిద్దరనే కాదు, ఈ విషయాల్లో ఇప్పుడు ప్రభాస్‌, చరణ్‌, అల్లు అర్జున్‌ కూడా ఫాస్ట్‌గానే పావులు కదుపుతున్నారని భోగట్టా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు