మహేష్, నమ్రత డీవీడీలు పంపిస్తారట

మహేష్, నమ్రత డీవీడీలు పంపిస్తారట

మహేష్ బాబు, నమ్రతా శిరోద్కర్లు బాలీవుడ్లోని ఒక స్టార్ ఫ్యామిలీకి తరచుగా తెలుగు డీవీడీలు పంపిస్తుంటారట. ఇక్కడే మంచి సినిమా వచ్చినా.. దాని డీవీడీలు రాగానే ముంబయికి పార్శిల్ చేసేస్తారట. ఇంతకీ వీళ్లు డీవీడీలు పంపించేది ఎవరికో తెలుసా..? సైఫ్ అలీ ఖాన్కు. ఈ సంగతి సైఫ్ భార్య కరీనా కపూరే స్వయంగా వెల్లడించింది. తన కొత్త సినిమా 'కి క" ప్రమోషన్ల కోసం హైదరాబాద్ వచ్చిన కరీనా.. తెలుగు సినిమాలు చూస్తుంటారా అని అడిగితే ఈ సంగతి బయటపెట్టింది. ''ఈ మధ్య తెలుగు సినిమాలేమీ చూడలేదు. ఐతే సైఫ్కి మహేష్, నమ్రత మంచి స్నేహితులు. వాళ్లు తరచుగా తెలుగు సినిమాల డీవీడీలు పంపిస్తుంటారు. ఇద్దరం కలిసి చూస్తుంటాం"" అని చెప్పింది కరీనా.

ఇంతకీ తెలుగులో కొన్ని ఆఫర్లు వచ్చినా ఎందుకు ఎందుకు నటించలేదు అని అడిగితే.. ''భాషే సమస్య. నా నటనకు భాష అడ్డంకిగా మారకూడదు. అది తప్ప వేరే కారణాలేమీ లేవు. అందుకే ఇక్కడ సినిమాలు ఒప్పుకోలేదు"" అని చెప్పింది కరీనా. ఇంతకీ హైదరాబాద్లో మీకు ఏమిష్టం అని అడిగితే.. ''నాకు ఇక్కడి ఇడ్లీ అంటే చాలా చాలా ఇష్టం. హైదరాబాద్ వస్తే కచ్చితంగా ఇడ్లీ తెప్పించుకుని తింటా. ఈ నగరం కూడా చాలా బాగుంటుంది. విశాలంగా ఉంటుంది"" అని కరీనా అంది. 'కి క"లో ముద్దు సీన్లలో నటించారు కదా.. సైఫ్ అభ్యంతరం చెప్పలేదా అని అడిగితే.. ''నటన విషయంలో అలాంటి అభ్యంతరాలేమీ ఉండవు. సైఫ్ కానీ.. మిగతా కుటుంబ సభ్యులు కానీ.. సినిమాను సినిమా కోణంలోనే చూస్తారు. వ్యక్తిగతంగా చూడరు. సినిమాకు, వ్యక్తిగత జీవితానికి తేడా తెలిసిన కుటుంబంలో ఉన్నా కాబట్టి మాకు ఎలాంటి సమస్యా లేదు"" అని కరీనా తెలిపింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English