గ్యాంగ్ లీడర్ కోసం మెగా ఫైట్

గ్యాంగ్ లీడర్ కోసం మెగా ఫైట్

మెగా ఫ్యామిలీలో ఫ్యూచర్ స్టార్ గా ఎదిగే అన్ని లక్షణాలున్న హీరో సాయిధరంతేజ్. మెగా మేనల్లుడు అనే ఇమేజ్ తో వచ్చినా.. ఈ హీరోకు ఆ కుటుంబం నుంచి ఆ స్థాయి అండదండలు మాత్రం లేవనే చెప్పాలి. ఈయనకు దిల్ రాజు బ్యాక్ సపోర్ట్ గా దొరికాడు. వరసగా రాజుగారితోనే సినిమాలు చేస్తున్నాడు సాయి. ఇప్పటికే పిల్లా నువ్వులేని జీవితం, సుబ్రమణ్యం ఫర్ సేల్ సినిమాలతో క్రేజ్ తెచ్చుకున్నాడు సాయి. ఇక ఇప్పుడు సుప్రీమ్ లో నటిస్తున్నాడు ఈ హీరో. ఇది గనక హిట్టైతే సాయిధరం మార్కెట్ రేంజ్ 25 కోట్లకు చేరడం ఖాయం.

తన మేనల్లుడు ఇంత వేగంగా గుర్తింపు తెచ్చుకుంటాడని చిరంజీవి కూడా ఊహించి ఉండడు. మరోవైపు సాయి కూడా తన ప్రతీ సినిమాలోనూ మావయ్యను వీలైనంత మేర వాడేస్తూనే ఉంటాడు. సాంగ్స్ రూపంలో, డాన్స్ ల రూపంలో మేనమామను ఇమిటేట్ చేస్తుంటాడు సాయిధరంతేజ్. ఇక ఆ మధ్య ఓ అడుగు ముందుకేసి చిరంజీవి సూపర్ హిట్ టైటిల్ గ్యాంగ్ లీడర్ ను వాడేయాలని ఫిక్సయ్యాడు సాయిధరంతేజ్. గోపీచంద్ మలినేని సినిమా కోసం సాయి ఈ టైటిల్ పై కన్నేసాడు.

మావయ్య పాటల్ని వాడేసినంత ఈజీగా.. టైటిల్ ను వాడేయడం అంటే అంత ఈజీ కాదు. గ్యాంగ్ లీడర్ టైటిల్ విషయంలో ఊహించని విధంగా సాయిధరంతేజ్ కు వద్దనే మెసేజ్ లు మెగా క్యాంప్ నుంచే వచ్చాయని సమాచారం. గ్యాంగ్ లీడర్ అనే టైటిల్ చరణ్ కు మాత్రమే వాడుకోవాలని.. సాయికి వాడకూడదని చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తమ వరకు రానంత వరకు ఓకే గానీ.. తమను దాటాలని వస్తే మాత్రం మేనల్లుడైనా.. ఎవ్వరైనా ఒక్కటే అనే సంకేతాలు సాయి విషయంలో వెళ్లాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English