అనుష్క.. బంగారం ఇచ్చే సీనుందా

అనుష్క.. బంగారం ఇచ్చే సీనుందా

''మా సినిమా చూడండి.. బంగారం గెలుచుకోండి''.. ఇలాంటి ఆఫర్లు 90ల్లో బాగా కనిపించేవి. కానీ ఈ మధ్య ఈ టైపు ప్రమోషన్లు ఎవ్వరూ చేయట్లేదు. అలాంటి ఐడియాలు ఔట్‌డేటెడ్‌ అనుకుంటున్నారు ఇప్పటి మూవీ మేకర్స్‌. ఐతే 'సైజ్‌ జీరో' నిర్మాత పొట్లూరి వరప్రసాద్‌ మాత్రం మళ్లీ ఈ పాత ఐడియాతో జనాల్ని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. ఈ ఆఫర్‌ చూసి ఎంతమంది జనాలు థియేటర్లకు వచ్చారో కానీ.. 'సైజ్‌ జీరో' థియేటర్లు మాత్రం ఫస్ట్‌ వీకెండ్‌ నుంచే వెలవెలబోయాయి. వీకెండ్‌ అయ్యాక పరిస్థితి దారుణంగా ఉంది. చాలా చోట్ల సినిమాను లేపేశారు.

మరి పోటీలో ప్రకటించినట్లుగానే సినిమా చూసిన వాళ్లలోంచి ఓ విజేతను ఎంపిక చేసి కిలో బంగారం అందిస్తారో లేదో చూడాలిప్పుడు. సినిమా హిట్టయి.. మంచి కలెక్షన్లు వస్తే కిలో బంగారం బహుమతిగా ఇవ్వడం పెద్ద విషయం కాదు. అలాంటి కార్యక్రమాలతో సినిమాకు మంచి ప్రచారం కూడా లభిస్తుంది. కానీ సినిమా ఫ్లాపై జనాలు లేక థియేటర్లు ఖాళీగా కనిపిస్తున్నపుడు ఇలా కాంటెస్ట్‌ నిర్వహించడం.. విజేతను ఎంపిక చేసి కిలో బంగారం ఇవ్వడం అంటే నిర్మాతకు చాలా కష్టంగానే ఉంటుంది. పైగా డిసెంబరు 10 తర్వాత ఈ డ్రా తీయబోతున్నారు. అప్పటికి 'సైజ్‌ జీరో' థియేటర్లలోనే ఉండే అవకాశం లేదు. మరి నిజంగానే అనుష్క చేతుల మీదుగా విజేతకు కిలో బంగారం ఇస్తారో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు