సూపర్‌స్టార్స్‌ ఒక్కటై.. అతడిని గెంటేశారు!

సూపర్‌స్టార్స్‌ ఒక్కటై.. అతడిని గెంటేశారు!

సల్మాన్‌, షారుక్‌ మధ్య వున్న విబేధాలన్నీ తొలగిపోయి ఇప్పుడిద్దరూ మంచి దోస్తులైపోయారు. ఒకరినొకరు తరచుగా కలుసుకుంటూ... అపారమైన ప్రేమానురాగాలు కురిపించేసుకుంటున్నారు. గతంలో ఇద్దరి మధ్య ఇంతకంటే బలమైన స్నేహ బంధం వున్నా కానీ తర్వాత విడిపోయారు. కానీ పర్సనల్‌గా తాను డౌన్‌లో వున్నప్పుడు షారుక్‌ అందించిన స్నేహ హస్తం సల్మాన్‌ని పడేసింది. బజరంగి భాయ్‌జాన్‌ చిత్రం ఫస్ట్‌ లుక్‌ని రివీల్‌ చేయడం నుంచి షారుక్‌ అతనికి మరింత క్లోజ్‌ అయ్యాడు. షారుక్‌తో విబేధాలున్నప్పుడు ఆమిర్‌ ఖాన్‌కి దగ్గరైన సల్మాన్‌ ఇప్పుడు ఆమిర్‌ని పక్కన పెడుతున్నాడట.

బజరంగి భాయ్‌జాన్‌ ప్రాజెక్ట్‌ తనకే ముందు వచ్చిందని ఆమిర్‌ పబ్లిగ్గా చెప్పడం సల్మాన్‌కి నచ్చలేదట. అదేదో తాను వదిలేస్తే సల్మాన్‌కి దక్కిన వరం అనిపించేలా ఆమిర్‌ మాట్లాడ్డంతో హర్ట్‌ అయిన సల్లూ అతనితో మాటలు తగ్గించాడట. మొదట్నుంచీ షారుక్‌కి, ఆమిర్‌కి సత్సంబంధాలు లేవు. ఇప్పుడు షారుక్‌కి క్లోజ్‌ అయ్యాడు కనుక ఆమిర్‌ని సల్మాన్‌ పూర్తిగా దూరంగా పెడుతున్నాడట. సినీ ప్రేమలూ, స్నేహాలూ ఏవీ శాశ్వతం కాదని అంటుంటారు. దానికి నిలువెత్తు నిదర్శనరగా నిలుస్తాడు సల్మాన్‌ భాయ్‌!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English