అఖిల్‌కి జరిగిన డ్యామేజ్‌ ఎంత?

అఖిల్‌కి జరిగిన డ్యామేజ్‌ ఎంత?

దసరాని మిస్‌ అయిన అఖిల్‌ చాలానే మిస్‌ అయిందనిపిస్తోంది. రుద్రమదేవి అంతంత మాత్రంగా ఆడడం, బ్రూస్‌లీ ఫ్లాప్‌ అవడంతో మార్కెట్లో భారీ చిత్రాలు లేకుండా పోయాయి. శ్రీమంతుడు తర్వాత చిన్న సినిమాలు తప్ప పెద్ద సినిమాలు సందడి చేయలేదు. దసరాకి రిలీజ్‌ అయిన చిన్న చిత్రాలు బాగానే క్యాష్‌ చేసుకున్నాయి. ఆ టైమ్‌లో వచ్చినట్టయితే యావరేజ్‌గా వున్నా అఖిల్‌కి వర్కవుట్‌ అయిపోయేది.

దసరాని మిస్‌ అయిన అఖిల్‌ ఇప్పుడు దీపావళిని టార్గెట్‌ చేస్తున్నాడు. దీపావళికి ఒక్క సెలవు అయితే కలిసి వస్తుంది కానీ తెలుగు సినిమా బిజినెస్‌ పరంగా నవంబర్‌ నెల ఏమంత కలిసిరాదు. మరీ సంక్రాంతి వరకు వేచి చూడలేక, డిసెంబర్‌లో రిలీజ్‌ అవుతున్న అక్కినేని సినిమాలకి అడ్డు వెళ్లలేక దీపావళికి విచ్చేస్తున్న అఖిల్‌ దసరా మిస్‌ అవడం వల్ల ఖచ్చితంగా నష్టపోయాడు. అయితే ఈ డ్యామేజ్‌ ఎంత, రేపు ఈ చిత్రం దీపావళికి రిలీజ్‌ అయినా కానీ సీజన్‌ అడ్వాంటేజ్‌ దొరక్క వచ్చే సమస్యలెన్నీ అనేది రిలీజ్‌ అయితేగానీ లెక్క తేలదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు