పవన్ కొత్త వ్రతమేదో పట్టినట్లున్నాడే..

పవన్ కొత్త వ్రతమేదో పట్టినట్లున్నాడే..

ఆ మధ్య పవన్ గడ్డం వ్రతమేదో పట్టాడు. అడ్డూ అదుపు లేకుండా గడ్డం పెంచేసి.. జనాల్ని అయోమయంలోకి నెట్టాడు. ముందు రాజకీయ రంగప్రవేశం చేసినపుడు కాస్త గడ్డం పెంచితే బాగానే అనిపించింది. ఇంకాస్త పెరిగినా పర్లేదనుకున్నారు. కానీ నెలలు గడిచాయి గడ్డం తీయలేదు. ఓ దశలో అందరూ అతణ్ని ‘పవన్ బాబా’ అనడం మొదలుపెట్టారు. ఆ స్థాయిలో గడ్డం పెంచుకుని నెలల తరబడి అదే అవతారంలో కనిపించి మొహం మొత్తేలా చేశాడు పవన్. దీని వెనుక ఏదో వ్రతం ఉందన్న ప్రచారం కూడా జరిగింది. చివరికి కొన్ని నెలల కిందట గడ్డం తీసి మామూలు అవతారంలోకి వచ్చాడు పవర్ స్టారుడు.

ఐతే ఇప్పుడు కొత్తగా ఖాకీ వ్రతమేదో పట్టినట్లున్నాడు పవన్. దాదాపు నెల రోజులుగా ఎప్పుడూ ‘గబ్బర్ సింగ్’ ఖాకీ డ్రెస్సులోనే కనిపిస్తున్నాడు. లక్ష్మీరాయ్ తో కలిసి ఐటెం సాంగ్ చేస్తూ దిగిన సెల్ఫీ దిగినపుడు.. దేవిశ్రీ ప్రసాద్ భుజం మీద చేయి వేసి ఫొటో దిగినపుడు.. అమరావతి శంకుస్థాపనకు వచ్చిన మంత్రుల్ని కలిసిపుడు.. శంకరాభరణం టీజర్ లాంచింగ్ టైంలో.. చరణ్ ను సెట్లో కలిసి ఫొటో దిగినపుడు.. ఇలా ప్రతి సందర్భంలోనూ ‘సర్దార్’ గెటప్ వదల్లేదు. ఐతే ఆ సందర్భాలన్నీ కూడా వేరే వాళ్లు వచ్చి పవన్ ను కలిసినపుడు కాబట్టి ఓకే అనుకుందాం. కానీ అన్నయ్యను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లినపుడు కూడా అదే డ్రెస్ వేసుకెళ్లడమేంటో? పైగా ఒంటిమీద ఆ ఎర్రటి రుమాలు, జేబులో బొమ్మ తుపాకీ.. ఇవన్నీ కూడా ఎందుకు పవన్ ఒంటిపై ఉన్నాయన్నదే అర్థం కావడం లేదు. అప్పుడు గడ్డం వ్రతం పట్టినట్లే.. ఇప్పుడీ ఖాకీ వ్రతమేదో చేస్తున్నట్లున్నాడు పవన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English