అక్కడా బీబీ.. ఇక్కడా బీబీ

అక్కడా బీబీ.. ఇక్కడా బీబీ

'బాహుబలి' తప్ప ఇంకో టాపిక్‌ ఉండడం లేదీమధ్య. ఈ చిత్రం సంచలనాలు సృష్టిస్తుందని, బాక్సాఫీస్‌ వద్ద ఊహించశక్యం కానీ చరిత్ర నెలకొల్పుతుందని నమ్మకాలు వ్యక్తమవుతున్నాయి. మన వాళ్ల ఫోకస్‌ ఈ 'బీబీ'పై ఉన్నట్టే బాలీవుడ్‌ వాసులు 'భజరంగి భాయ్‌జాన్‌' చిత్రంపైనే చాలా ఆశలు పెట్టుకున్నారు. ఈ ఏడాదిలో ఇంతవరకు హిందీలో పెద్ద సినిమా అంటూ విడుదల కాలేదు. సల్మాన్‌ఖాన్‌కి బాగా కలిసి వచ్చిన రంజాన్‌ కానుకగా ఈ చిత్రం రిలీజ్‌ అవుతోంది.

ఈ ఆర్నెల్లలో ఇండియాలో వంద కోట్లు దాటి వసూలు చేసిన ఏకైక చిత్రం 'తను వెడ్స్‌ మను రిటర్న్స్‌'. బాలీవుడ్‌ మార్కెట్‌ మూడొందల కోట్ల పైనే ఉందని పికే నిరూపించిన తర్వాత ఇలాంటి ట్రాక్‌ రికార్డ్‌ అంటే పరిస్థితి ఘోరంగా ఉన్నట్టే. అందుకే సల్మాన్‌ఖాన్‌ వస్తాడు, బీబీతో 'బ్లాక్‌బస్టర్‌' సాధిస్తాడని చూస్తున్నారు. జులై 10న మన బాహుబలి విడుదలవుతోంటే, జులై 17న సల్మాన్‌ 'భాయ్‌జాన్‌' రిలీజ్‌ కానుంది. ఈ రెండూ అంచనాలని అందుకుంటే కనుక ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద హయ్యస్ట్‌ బిజినెస్‌ చూసే వీలుంటుంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు