అడ్డంగా దొరికేసి సైలెంట్‌ అయిపోయింది

అడ్డంగా దొరికేసి సైలెంట్‌ అయిపోయింది

తమిళ దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌తో నయనతార ప్రేమలో పడిందనే పుకార్లు వస్తే తనకి తన పని మీద తప్ప మరో ధ్యాస లేదని, చాలా సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్న తనకి ప్రేమించే తీరిక లేదని నయనతార సమాధానమిచ్చింది. ఆమె అంత ఖరాఖండీగా చెప్తే ఏం లేదని అనుకున్నారు కానీ కొద్ది రోజుల క్రితం లీక్‌ అయిన నయన్‌-శివన్‌ల సెల్ఫీ వారి మధ్య అఫైర్‌ ఉందనే వార్తలకి బలాన్నిచ్చింది.

శింబు, ప్రభుదేవాలతో ప్రేమ వ్యవహారం చెడిన తర్వాత నయనతార ఇక మళ్లీ లవ్‌ జోలికి పోదని అనుకున్నారు కానీ మళ్లీ ఆమె 'క్రియేటివ్‌ తమిళియన్‌'కే ఎట్రాక్ట్‌ అయినట్టుంది. ఈ సెల్ఫీతో నయనతార గురించిన రూమర్లు బాగా పెరిగిపోయినా తను మాత్రం అసలు ఇదేమీ తెలీదన్నట్టే సైలెంట్‌గా ఉంది. గతంలో కూడా శింబు, ప్రభుదేవాలతో తన అఫైర్‌ బయటకి పొక్కిన తర్వాత దాని గురించి మాట్లాడడానికి ఇష్టం లేదన్నట్టు మీడియా ముందుకి కూడా వచ్చేది కాదు. ఇప్పుడూ అదే రిపీట్‌ చేస్తున్నట్టుంది. ముచ్చటగా మూడో లవ్‌స్టోరీ అయినా మ్యారేజీ దాకా వెలుతుందో లేదో చూడాలి మరి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు