తెలుగుదేశం యూకే మహానాడు..

మా తెలుగు తల్లికి మల్లెపు దండ
మా కన్నతల్లికి మంగళారతులు..

అలా ఆంధ్ర రాష్ట్ర గీతంతో, జ్యోతి ప్రజ్వలనతో‌, లండన్ నగరంలో అంగరంగవైభవంగా, సొంత ఇంటి పండుగలా, పసుపుతోరణంలా, ర్యాలీగా బయలుదేరి మొదలైంది తెలుగుదేశం యూకే మహానాడు..

ఈ మహానాడుకి ఉన్న ప్రత్యేకత వేరు..తెలుగువారి ఆరాధ్య దైవం, వెండితెర ఇలవేల్పు, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు, పద్మశ్రీ డా౹౹ నందమూరి తారక రామారావు గారి 99వ జయంతి. రాబోవు శత జయంతి ఉత్సవాలను సంవత్సరమంతా చేయాలని పార్టీ నిర్ణయించడంతో తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఉత్సాహంతో, ఉరకలు వేస్తూ యూకే వ్యాప్తంగా అన్ని నగరాల నుంచి మహానాడు వేదికకు చేరుకున్నారు.

“అన్న” గారి విగ్రహానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా పూలు చల్లి, నమస్కరించుకుంటూ, జోహర్ ఎన్టీఆర్ అంటూ నినదించారు. మహనాడు కార్యక్రమంలో పార్టీ కోసం త్యాగాలు చేసి తమ ప్రాణాలను సైతం అడ్డుపెట్టి అమరులైన కార్యకర్తల కోసం, నాయకుల కోసం మౌనం పాటించారు.

ఆ తారక రాముని జననం, ఉద్యోగం, సిని ప్రస్థానం, రాజకీయ ప్రస్థానం జ్ఞాపకాలతో మొదలై తెలుగు సినిమాకు ఆయన చేసిన సేవలు, పార్టీ ఆవిర్భావం, పేద బడుగు బలహీన వర్గాలకు అండగా పెట్టిన పథకాలు, తెలుగు వారి ఆత్మగౌరవం నిలబడేలా చేసి,తెలుగు వారి ఖ్యాతిని దేశవిదేశాల్లో చాటి చెప్పిన తీరు గుర్తు చేసుకుని జోహర్ ఎన్టీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినదించారు..

వైసీపీ ప్రభుత్వంలో పెరుగుతున్న రేట్లు, వైఫల్యాలు, ఆడపిలల్లపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అకృత్యాలు, కరెంటు కొనుగోలు అవకతవకలు, నిరాదరణకు గురైన విద్య, వైద్యరంగాలు గురించి చర్చించారు

తెలుగుదేశం సభ్యత్వ నమోదు కార్యక్రమం, 2024లో తెలుగుదేశం తిరిగి అధికారంలో తీసుకరావడానికి కృషి చేయాలని మహానాడులో తీర్మానాలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, జూమ్ కాల్ ద్వారా హాజరై పార్టీ పటిష్టానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. పార్టీ పట్ల ఎన్నారై ల నిబద్ధథను కొనియాడారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి శ్రీదేవి గుంటుపల్లి గారు హాజరై ఎన్టీఆర్ గారు చేసిన సేవలను కొనియాడారు..ఈ కార్యక్రమానికి వందల కొద్ది తెలుగుదేశం శ్రేణులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేశారు..

ఈ కార్యక్రమానికి జయకుమార్ గుంటుపల్లి, వేణు మాధవ్ పోపూరి, శ్రీనివాస్ పాలడుగు, ప్రసన్న నాదెండ్ల, శ్రీకిరణ్ పరుచూరి, నరేష్ మల్లినేని, భాస్కర్ అమ్మినేని, జయరామ్ యలమంచిలి, రవికాంత్ కోనేరు, లగడపాటి శ్రీనివాస్, చక్రి మువ్వ‌, నారాయణ రెడ్డి, సురేష్ కోరం, వీర పరిటాల, చందు నారా, సుందర్రాజు మల్లవరపు, శివరాం కూరపాటి, కళ్యాణ్ కాపు, శ్రీకాంత్ యర్రం, మహేంద్ర తాళ్ళూరు, శ్రీథర్ నారా, రవికిరణ్ అరవపల్లి, సురేష్ అట్లూరి, జోషిరావు నర్రా, ప్రభాకర్ అమిరినేని, శ్రీథర్ బెల్లం, వంశీ గొట్టిపాటి,పతంజలి కొల్లి, ఆర్కే రాయపూడి, అజయ్ ధూళిపాళ్ల, రాజశేఖర్ బోడపాటి, జనార్దన్ పోలూరు, వినయ్ కామినేని తదితరులు తమ పూర్తి సహయసహకారాలు అందించారు