సికే ఇన్ఫిని సమర్పణలో మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేష్ అగస్త్య,సంజన సారధి జంటగా డాక్టర్ సందీప్ చేగూరి దర్శకత్వంలో బి.చంద్రకాంత్ రెడ్డి నిర్మిస్తున్న ‘సరసాలు చాలు’ చిత్రం పూజ కార్యక్రమాలు హైదరాబాద్ లోని జె ఆర్.సి కన్వెన్షన్ సెంటర్ లో ఘణంగా జరుపుకుంది..ఈ కార్యా క్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన మినిస్టర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడు తలసాని సాయి కిరణ్ యాదవ్ చిత్ర యూనిట్ కు స్క్రిప్ట్ ను అందజేయగా..చిత్ర నిర్మాత భార్య శృతి రెడ్డి హీరో, హీరోయిన్ లపై తొలి ముహూర్తపు సన్ని వేశానికి క్లాప్ కొట్టారు, నిర్మాత చంద్రకాంత్ రెడ్డి ,రోహిత్ లు కెమెరా స్విచ్ఛాన్ చేశారు. లూజర్ వెబ్ సిరీస్ దర్శకుడు అభిలాష్ రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు.ఈ పూజా కార్యక్రమాలు అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో
చిత్ర నిర్మాత బి.చంద్రకాంత్ రెడ్డి మాట్లాడుతూ .. చిన్నప్పటి నుండి సినిమా అంటే ఏంతో ఇష్టం ఉండడంతో సందీప్ చెప్పిన కథ నచ్చి ఈ మూవీ చేస్తున్నాను రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులను అలరించే విధంగా తీస్తాము.ఇక ముందు మా బ్యానర్లో ఇలాంటి మంచి సినిమాలు చేస్తాము అని అన్నారు
చిత్ర దర్శకుడు డాక్టర్ సందీప్ చేగూరి మాట్లాడుతూ .. ఒక “చిన్న విరామం” సినిమా తర్వాత వస్తున్న నా రెండవ సినిమా “సరసాలు చాలు” పేరుకు తగ్గట్టే ఈ సినిమా చాలా కలర్ ఫుల్ బ్రీజి ఎంటర్ టైనర్.,కామెడీ కు ఇంపార్టెంట్ ఇస్తూ సాగే ఫుల్ కామెడీ క్లిన్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం ప్రతి కపుల్ కి, రిలేషన్ షిప్ లో ఉన్న వాళ్ళకి, పెళ్లైన వాళ్ళ కి కనెక్ట్ అయ్యే సబ్జెక్ట్ ఇది.ఇందులో కూడా ఎమోషన్స్, హార్ట్ బ్రేక్స్, నవ్వులు, కోపాలు ఉంటాయి. మంచి రొమాంటిక్ కామెడీతో వస్తున్న ఈ చిత్రంలో అద్భుతమైన నాలుగు పాటలు ఉంటాయి. మూడు షెడ్యూల్లో ఈ సినిమాను పూర్తి చేసి సమ్మర్ లో విడుదల చేస్తామని అన్నారు.
చిత్ర హీరో నరేష్ అగస్త్య మాట్లాడుతూ ..రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
హీరోయిన్ సంజన సారధి మాట్లాడుతూ.. దర్శకుడు చెప్పిన కథ వినగానే ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. నటనకు మంచి స్కోప్ వుండే ఈ చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.
ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని అన్నారు.
నటీనటులు
నరేష్ అగస్త్య,సంజన సారధి తదితరులు
సాంకేతిక నిపుణులు
సమర్పణ : సికే ఇన్ఫిని
బ్యానర్ : మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : బి.చంద్రకాంత్ రెడ్డి
రైటర్, డైరెక్టర్ : డాక్టర్ సందీప్ చేగూరి
డి.ఓ.పి : రోహిత్ బట్చు,
మ్యూజిక్ : భరత్ మంచిరాజు
ప్రొడక్షన్స్ డిజైనర్ : ఝాన్సీ
This post was last modified on December 29, 2021 6:39 pm
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన నేపథ్యంలో అరెస్టయి బెయిల్ పై విడుదలైన అల్లు అర్జున్ కు పోలీసులు తాజాగా మరో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా..ఆమె తనయుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ…
తమిళ లెజెండరీ దర్శకుడు శంకర్ అంటే తెలుగు ప్రేక్షకులకే కాదు, ఇండస్ట్రీ జనాలకు కూడా ఆరాధన భావం. తన తొలి…
విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…
రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…