“కార్తీక దీపం”.. ఒక ప్రమాదం నుంచి కోలుకుని, తేరుకుని కొత్తగా ఊపిరి తీసుకుంది. అదే – ఒక ప్రమాదంలో కార్తీక దీపం సీరియల్ కి దీప దూరమైనా ఇప్పుడు ఆ సీరియల్ లో దీప పాత్ర మళ్ళీ మొదలైంది.
తెలుగు రాష్ట్రాల్లో ఆమెకి వున్న లక్షలాది అభిమానులు ఆమె కోసం పూజలు చేశారు. ఒక సగటు మహిళ.. తనకి ఎన్ని కస్టాలు ఎదురైనా వాటినుంచి ఎలా బయట పడుతుందో .. ఇంటిని, ఇంట్లో మనుషుల్ని మళ్ళీ ఎలా గెలుచుకుంటుందో – అదే చేసి దీప ప్రతి తెలుగు ఇంట్లో ఒక మనిషిగా మారిపోయింది. దీప ఇంట్లో కష్టం తమ ఇంటి కష్టం అనుకున్నారు. దీప పడుతున్న ఆవేదన అందరి ఆవేదన అయింది. దీప కన్నీళ్లు పెట్టుకుంటే ఆ కన్నీళ్ళని తుడవమని ఎందరో దైవాన్ని ప్రార్థించడం అతిశయోక్తి కాదు. దీపకి వున్న ఫ్యాన్ ఫాలోయింగ్ సాధారణమైనది కాదు..
తెలుగు రాష్ట్రాల్లో దీప గురించి మాట్లాడుకోని ఇల్లు ఉండదు. దీప ఇప్పుడు మళ్ళీ సీరియల్ లోకి తిరిగి రావడం పెద్ద పండగలా అనిపిస్తోంది. ఎవరిని కదిపినా ఈ సంతోషం స్పష్టంగా తెలుస్తోంది.
స్టార్ మా లో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30 గంటలకు ప్రసారమయ్యే ఈ ధారావాహిక దీప పునరాగమనంతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువ కాబోతోంది అంటున్నారు ఆ సీరియల్ అభిమానులు. ఈ సీరియల్ లోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని దీప కూడా అభిప్రాయపడింది. ప్రేక్షకులు తనపై చూపించిన ప్రేమకి కృతజ్ఞతలు చెప్పింది దీప.
“కార్తీక దీపం” ప్రోమో కోసం ఇక్కడ క్లిక్ చేయండి: https://bit.ly/3cfwAx5
Content Produced by: Indian Clicks, LLC
Gulte Telugu Telugu Political and Movie News Updates