Political News

ఏపీ సర్కార్ కు ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు

ఏపీ సర్కార్ కు హైకోర్టులో ఒకే రోజు మూడు ఎదురు దెబ్బలు తగిలాయి. మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది. మరోవైపు, డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో పోలీసుల తీరుపై సీబీఐ విచారణకు హైకోర్టు ఆదేశించింది. దీంతోపాటు, ఏపీలోని పంచాయతీ కార్యాలయాలకు రంగులు వేయడంపై ఏపీ ప్రభుత్వం జారీ చేసిన 623 జీవోను హైకోర్టు రద్దు చేసింది. దీంతో, ఏపీ సర్కార్ కు ఒకే …

Read More »

ఆంధ్రా గ్రీన్స్… ఈ-కామర్స్ లో ఏపీ సర్కారీ సైట్

విశ్వవ్యాప్తంగా ఇప్పుడు అంతా ఈ- కామర్స్ మంత్రం అమలు అమలవుతోంది. అందుకు మన దేశం కూడా మినహాయింపేమీ కాదు. అయితే ఎన్ని దేశాల్లో ఈ-కామర్స్ సైట్లు ఉన్నా అన్నీ ప్రైవేట్ వ్యక్తులు నడిపిస్తున్నవే. అయితే ఈ రంగంలో నవ్యాంధ్రప్రదేశ్ లోని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సర్కారు నవ శకానికి నాందీ పలికింది. ఇప్పటిదాకా ఏ ఒక్కరూ అమలు చేయని విధంగా ‘ఆంధ్రా గ్రీన్స్’ పేరిట ఈ- కామర్స్ రంగంలో …

Read More »

‘అమ్మ’ ఆస్తి ఇక.. తమిళనాడు ప్రభుత్వానిదే

వచ్చేటప్పుడు ఉత్త చేతులతో వస్తాం.. పోయేటప్పుడు వెంట ఏమీ తీసుకెళ్లమన్న భావన ప్రతిఒక్కరిలో కలిగేలా చేయటంలో తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవితాన్ని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. తిరుగులేని నేతగా ఉన్న ఆమె.. ఉన్నట్లుండి అనారోగ్యానికి గురి కావటం..అపోలో ఆసుపత్రిలో చేరటం తెలిసిందే. అర్థరాత్రి దాటిన తర్వాత ఆసుపత్రికి వెళ్లిన ఆమె.. తిరిగి రాని లోకాలకు వెళ్లిన తర్వాత మాత్రమే ఆమెను చూసే అవకాశం ప్రజలకు లభించింది. అపోలో ఆసుపత్రిలో …

Read More »

బిగ్ బ్రేకింగ్ – సుధాకర్ కేసు సీబీఐకి ఇచ్చిన హైకోర్టు

సస్పెండ్ అయిన డాక్టర్ సుధాకర్ కేసు కొత్త మలుపు తీసుకుంది. ఈ కేసును సీబీఐ కి అప్పగిస్తూ ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ నివేదిక తప్పు దారి పట్టించేలా, నిజాలు దాచి రాసినట్టు అనిపిస్తోంది విచారణ సందర్భంగా హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. డా.సుధాకర్ వ్యవహారంలో విశాఖ పోలీసులపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీబీఐకి ఆదేశించిన హైకోర్టు 8 వారాల్లోగా విచారణ పూర్తిచేసి …

Read More »

టీఆర్ఎస్ హయాంలో బాబు కు మించిన ఫలితాలు

హైద‌రాబాద్‌లో ఐటీ రంగం అభివృద్ధి అంటే త‌న పుణ్య‌మేన‌ని ప్ర‌క‌టించుకునే చంద్ర‌బాబు అవాక్క‌య్యేలా దేశంలోనే రికార్డు స్థాయిలో ఐటీ రంగం ఎగుమ‌తులు సాధించింది. పైగా ఈ ఫ‌లితాలు చంద్ర‌బాబు హైద‌రాబాద్‌లో ఉన్న స‌మ‌యంలోనే వెలువ‌డటం గ‌మ‌నార్హం. గ‌త ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రూ.1.28 లక్షల కోట్ల ఎగుమతులను సాధించింది. చివరి త్రైమాసికంలో ప్రపంచ ఆర్థికరంగం కుదేలైనప్పటికీ రాష్ట్ర ఐటీ మాత్రం అదే జోరును కొనసాగించింది. ఈ ఏడాది జనవరి మార్చి …

Read More »

రంగనాయకమ్మకు ఎన్ని గంటల విచారణ అంటే?

చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటే ఎలా ఉంటుందో చూడాలనుకుంటున్నారా? గుంటూరులో జరిగిన సన్నివేశాన్ని చూస్తే అర్థమవుతుంది. విశాఖ పాలిమర్స్ దుర్ఘటనకు సంబంధించి సోషల్ మీడియాలో వచ్చిన ఒక పోస్టును చూసి.. సరిగా చెక్ చేసుకోకుండా.. ముందు వెనుకా ఆలోచించకుండా పోస్టు చేసిన 67 ఏళ్ల పెద్ద వయస్కురాలు రంగనాయకమ్మకు సీఐడీ నోటీసులు జారీ చేయటం తెలిసిందే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేయటాన్ని తప్పు …

Read More »

గుడ్ న్యూస్.. బ్యాంకు రుణాలపై మారిటోరియం మరో 90 రోజులు

ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక పరిస్థితులు నెలకొన్న వేళ.. సగటుజీవి బతుకు బండి దారుణంగా దెబ్బ తిన్న వేళ.. రేపేం చేయాలన్న వేదనలో మునిగిపోయిన వారికి ఊరటనిచ్చేలా.. మధ్యతరగతి జీవి మనోవ్యధకు కాస్త ఉపశమనం కలిగించేలా కీలక ప్రకటన చేసింది కేంద్ర సర్కారు. ఈ మధ్యనే రూ.20లక్షల కోట్ల భారీ ఆర్థిక ప్యాకేజీ ప్రకటించినట్లుగా కేంద్రం గొప్పలు చెప్పినప్పటికీ సామాన్యుడికి నేరుగా కలిగిన ప్రయోజనం శూన్యమన్న మాట పలువురి నోట వినిపిస్తోంది. …

Read More »

విమానాల్లో వాయించేస్తున్నారుగా…

రెండు నెలలుగా దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలు లేక సెలబ్రెటీలు, వ్యాపారవేత్తలతో పాటు ఉన్నత వర్గాల వాళ్లందరూ ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. వలస కూలీలు, సామాన్యుల కోసం రైళ్లు, బస్సులు పున:ప్రారంభించారు కానీ.. ప్రయాణాల కోసం విమానాల్నే ఆశ్రయించే వారు మాత్రం తమకెప్పుడు వెసులుబాటు లభిస్తుందా అని ఎదురుచూస్తూనే ఉన్నారు. ఐతే వివిధ దేశాల్లో చిక్కుకున్న భారతీయుల కోసం అంతర్జాతీయ ప్రత్యేక విమానాలు నడిపిన ప్రభుత్వం.. రోజు వారీ సర్వీసుల్ని ఈ …

Read More »

కేసీఆర్ నిర్ణయానికి షాకిస్తూ హైకోర్టు కీలక తీర్పు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి ఎదురుదెబ్బ తగిలింది. కొద్దికాలంగా పలు మీడియా సమావేశాల్లో ఆయన వినిపిస్తున్న వాదనను కొట్టిపారేసేలా తాజాగా ఇచ్చిన హైకోర్టు తీర్పు ఉండటం గమనార్హం. మాయదారి రోగాన్ని గుర్తించేందుకు వీలుగా నిర్వహించే టెస్టులను ప్రైవేటు సంస్థలు కూడా చేయొచ్చంటూ ఐసీఎంఆర్ అనుమతిని ఇచ్చింది. తెలంగాణలోని 12 సంస్థలకు ఈ పరీక్షలు చేసే వెసులుబాటు కల్పించింది. అయితే.. ఐసీఎంఆర్ ఇచ్చిన ఆదేశాలకు నో చెబుతూ తెలంగాణ …

Read More »

ఏపీ ఉద్యోగుల వేదన తీరింది

ఓవైపు సంక్షేమ పథకాలకు వేల కోట్ల నిధులు విడుదల చేస్తూ.. తమకు మాత్రం కోతలు విధించడం ఏంటంటూ ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగులు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కొన్ని రోజులుగా. కరోనా వైరస్ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి తలకిందులు కావడంతో గత రెండు నెలలు ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు యాభై శాతం జీతాల్లో కోత విధించిన సంగతి తెలిసిందే. మే నెలలో కూడా ఇదే పద్ధతి కొనసాగితే తామంతా ఆర్థిక …

Read More »

నా భర్త చనిపోయాడని గ్యారంటీ ఏంటి? – కరోనా మృతుడి భార్య

ఆ కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కుటుంబ పెద్దతో పాటు పెళ్లై భార్యాపిల్లలున్న అతడి కుమారుడు కూడా మరణించాడు. మిగిలిన కుటుంబ సభ్యులు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరారు. కుటుంబ పెద్ద చనిపోయిన విషయం వారికి తెలిసినా.. కుటుంబానికి ఆధారంగా ఉన్న అతడి కుమారుడి మరణవార్త మాత్రం ఆ ఫ్యామిలీకి తెలియలేదు. ఈలోగా కుటుంబ పెద్దతో పాటు అతడి కుమారుడి మృతదేహానికి కూడా అంత్యక్రియలు జరిగిపోయాయి. ఈ …

Read More »

కరోనా ఎఫెక్ట్.. ప్రపంచం ఎక్కడుంది?

కరోనా వైరస్ విషయంలో ఇంతకుముందు ప్రపంచ వార్తల మీదే అమితమైన ఆసక్తి ఉండేది. మన దగ్గర ఈ మహమ్మారి ప్రభావం పెద్దగా లేని సమయంలో ఎక్కడ ఏ దేశంలో ఎన్ని కేసులు నమోదయ్యాయి.. ఎక్కడ మరణాలు ఎక్కువన్నాయంటూ ఆసక్తిగా చూసేవాళ్లు. అమెరికా, ఇటలీ దేశాల్లో కరోనా ఉద్ధృతి గురించి తెగ చర్చించుకునేవాళ్లం. కానీ గత నెల రోజుల్లో కథ మారిపోయింది. మన దగ్గర వైరస్ విజృంభణ మొదలయ్యాక మన బాధలతోనే …

Read More »