ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తాజాగా వైసీపీ పాలనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆనాటి పాలన లో పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎవరో కూడా ఆ పార్టీ వారికే తెలియదని అన్నారు. ఇక, ప్రజలకు ఏం తెలుస్తుందని చెప్పారు. తాజాగా ఆయన ఉమ్మడికృష్ణాజిల్లాలోని కంకిపాడులో నిర్వహించిన `పల్లె పండు గ-పంచాయతీ వారోత్సవాలు` కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రహదారి పనులకు పవన్ కల్యాణ్ ప్రారంభోత్సవం చేశారు.
అనంతరం పవన్ మాట్లాడుతూ.. “రాష్ట్రం చేసుకున్న అదృష్టం.. రాష్ట్ర ప్రజల అదృష్టం.. అపార అనుభ వం ఉన్న చంద్రబాబు ముఖ్యమంత్రి కావడమే“ అని తెలిపారు. అన్నీ ఆలోచించుకునే ఆ నాడు టీడీపీకి మద్దతు ఇచ్చినట్టు చెప్పారు. తాము అనుకున్న ప్రకారం.. కలిసి ముందుకు నడిచామని.. దీంతో విజ యం దక్కిందన్నారు. ప్రజల కష్టాలు తీర్చేందుకే తాము వచ్చినట్టు తెలిపారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒకే రోజు గ్రామసభలు పెట్టుకున్నామని(అక్టోబరు 2) చెప్పారు.
ప్రభుత్వం ఎంతో బలంగా ఉందని, అయితే.. వ్యవస్థలో వ్యక్తులు కూడా బలంగా ఉండాలని పవన్ కల్యా ణ్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు చేపట్టిన పనుల ద్వారా అందరికీ ఉపాధి అవకాశాలు వస్తాయని తెలిపారు. “చంద్రబాబు చాలా బలవంతుడు. ఆయన బలాన్ని మనం ఉపయోగించుకోకపోతే ప్రయోజన లేదు. పైగా తప్పు చేసిన వాళ్లం అవుతాం. చంద్రబాబు అనుభవం ఈ రాష్ట్రానికి అత్యంత అవసరం“ అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం లంచాల ప్రభుత్వం కాదని పవన్ కల్యాణ్ చెప్పారు. తన పేరు చెప్పి.. లంచాలు డిమాండ్ చేసిన అధికారిని కూడా వదిలపెట్టలేదన్నారు. ఇప్పుడు ప్రజలకు కావాల్సిన విధంగా ప్రభు త్వం పనిచేస్తోందని చెప్పారు. గతంలో ఒక్కటంటే ఒక్క గ్రామ సభ కూడా పెట్టలేదన్నారు. గ్రామీణ అభివృద్ధికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారో కూడా తెలియదని వ్యాఖ్యానించారు. “గతం ప్రభుత్వంలో బూతులు తప్ప చేసిందేంలేదు“ అని పవన్ నిప్పులు చెరిగారు.
This post was last modified on October 15, 2024 1:38 pm
ఇటీవలే కంగువ ఇచ్చిన షాక్ నుంచి సూర్య కోలుకున్నాడో లేదో కానీ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో చేసిన సినిమాని వీలైనంత…
అదేంటి.. అనుకుంటున్నారా? ప్రపంచం మొత్తం ముందుకు సాగుతుంటే చంద్రబాబు వెనక్కి తీసుకువె ళ్లడం ఏంటి? అని విస్మయం వ్యక్తం చేస్తున్నారా?…
ఈ రోజుల్లో సినిమా తీయడం కంటే దాన్ని సరిగ్గా ప్రమోట్ చేసి ప్రేక్షకులకు చేరువ చేయడమే పెద్ద టాస్క్ అయిపోయింది.…
వైసీపీ హయాంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతలపై సినీ నటుడు,వైసీపీ నేత పోసాని కృష్ణ ముురళి సంచలన వ్యాఖ్యలు చేసిన…
భారతీయ సంగీతాన్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. స్లమ్ డాగ్ మిలియనీర్ చిత్రానికి గాను ఉత్తమ…