Political News

నేత‌ల‌కు ప‌గ్గాలు.. సీఎం నిర్ణ‌యం ఇదీ!

ఏపీలో రాజ‌కీయ ముఖ చిత్రం మారింది. ఇప్ప‌టి వ‌ర‌కు నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు, ఎమ్మెల్యేలు.. ఎలా వ్య‌వహరించినా.. ఇప్పుడు ఇక‌, వారికి ప‌గ్గాలు వేస్తూ.. సీఎం చంద్ర‌బాబు నిర్ణ‌యం తీసుకున్నారు. “నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఎలా ఉన్నార‌నేది నాక‌న‌వ‌స‌రం. ఇక నుంచి మాత్రం జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే” అని బాబు తేల్చిచెప్పారు. తాజాగా ప్ర‌తి జిల్లాకు ఒక మంత్రిని ఇంచార్జ్‌గా నియ‌మించారు.

అయితే.. ఇక్క‌డ మంత్రులు ఇంచార్జ్‌లుగా వ‌స్తే.. కేవ‌లం ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలే కాదు.. వారు రాజ‌కీయంగా కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల్సి ఉంటుంద‌ని చంద్ర‌బాబు స్ప‌ష్టం చేశారు. వాస్త‌వానికి ఏ ప్ర‌భుత్వం వ‌చ్చినా.. జిల్లాల‌కు ఇంచార్జ్ మంత్రుల‌ను నియ‌మిస్తారు. కానీ, చంద్ర‌బాబు హ‌యాంలో ఇంచార్జ్ మంత్రి అంటే లెక్క‌లు వేరేగా ఉంటాయి. నాయ‌కుల‌ పై ఆయ‌న ఒక కన్నేసి ఉంచుతారు. వారు ఏం చేస్తున్నా తెలుసుకుంటారు. ఈ క్ర‌మంలోనే తాజాగా మంత్రుల‌కు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

వీరే ఇంచార్జ్ మంత్రులు..

విజయనగరం: హోం మంత్రి వంగ‌ల‌పూడి అనిత, శ్రీకాకుళం: ర‌వాణా శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్వతీపురం మన్యం, కోనసీమ: వ్య‌వ‌సాయ మంత్రి అచ్చెన్నాయుడు, విశాఖ: సాంఘిక సంక్షేమ మంత్రి బాలవీరాంజనేయస్వామి, అల్లూరి సీతారామరాజు జిల్లా: గిరిజ‌న సంక్షేమ మంత్రి సంధ్యారాణి, అనకాపల్లి: ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర, కాకినాడ: పుర‌పాల‌క మంత్రి నారాయణ, కర్నూలు, తూ.గోదావ‌రి: వ్య‌వ‌సాయ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, పల్నాడు, ప.గోదావ‌రి: విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎన్‌టీఆర్‌ జిల్లా: వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్, కృష్ణా జిల్లా:వాసంశెట్టి సుభాష్‌, గుంటూరు: కందుల దుర్గేష్‌, బాపట్ల: పార్థసారథి, ప్రకాశం: ఆనం రామనారాయణరెడ్డి, నెల్లూరు: ఫరూఖ్‌, నంద్యాల-పయ్యావుల కేశవ్, అనంతపురం-టీజీ భరత్ శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల‌కు: అనగాని సత్యప్రసాద్ నియ‌మితుల‌య్యారు.

This post was last modified on October 15, 2024 1:30 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

మేము పుష్ప 2 కోసం పని చెయ్యలేదు, ప్రాణాలు పెట్టేసాం: బన్నీ!

ఐకాన్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడాని ఎదురు చూసిన ఘట్టం జరిగిపోయింది. నిన్నటిదాకా పక్క రాష్ట్రాల్లో జరిగిన పుష్ప 2 ప్రమోషన్లను…

5 hours ago

మీ హీరో ఇంకో మూడేళ్లు ఇస్తే పార్ట్ 3 తీస్తా : సుకుమార్!

పుష్ప 2 ది రూల్ కు సంబంధించి ఎన్ని ఈవెంట్లు చేసినా పని ఒత్తిడి వల్ల ఇప్పటిదాకా బయటికి కనిపించనిది…

6 hours ago

మగధీర తర్వాత పుష్ప 2నే – అల్లు అరవింద్!

హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో జరిగిన పుష్ప 2 ది రూల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాస్…

6 hours ago

తెల్ల చీరలో హంస వలె కవ్విస్తున్న కిస్సిక్ పాప..

కన్నడ మూవీ కిస్ తో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి.. దర్శకేంద్రుడు తెరకెక్కించిన పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ఇండస్ట్రీలో…

6 hours ago

ఏపీ టికెట్ రేట్లు వచ్చేశాయి… పవన్ కి థాంక్స్ చెప్పిన బన్నీ!

తెలంగాణలో టికెట్ ధరల పెంపు, జీవోలు వచ్చేసి ఆన్ లైన్ అమ్మకాలు మొదలయ్యాక కూడా ఆంధ్రప్రదేశ్ వైపు నుంచి ఆలస్యం…

7 hours ago

పుష్ప కి ప్రమోషన్ అక్కర్లేదు : రాజమౌళి ఎలివేషన్!

కిక్కిరిసిపోయిన అభిమాన జనసందోహం మధ్య పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ యూసఫ్ గూడ గ్రౌండ్స్ లో ఘనంగా…

7 hours ago