మీరు ఓజీ.. ఓజీ అంటుంటే.. నాకు మోడీ-మోడీ అనే వినిపిస్తోంది అని ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తాజాగా తన అభిమానులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కృష్నాజిల్లా కంకిపాడులో నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. సినిమాల్లో తనకు ఏ ఇతర నటలతోనూ పోటీ లేదని చెప్పారు. హీరోలందరూ బాగుండాలనే కోరుకుంటానని తెలిపారు. అయితే.. సినిమాలకన్నా ముందు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రతి ఒక్కరూ దృష్టి పెట్టాలని కోరారు.
ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక స్వావలంబన కోసం.. అనేక ప్రయత్నాలు చేస్తున్నట్టు పవన్ కల్యాణ్ తెలిపారు. దీనిలో భాగంగా సోమవారం నుంచి వచ్చే వారం రోజుల పాటు గ్రామీణ ప్రాంతాల్లో పల్లె పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. దీనిలో భాగంగా గ్రామీణ కుటుంబాలకు కనీసం 100 రోజులపా టు ఉపాధి కల్పించనున్నట్టు తెలిపారు. సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్లు, కాంపౌండ్ వాల్స్ వంటివి నిర్మించ నున్నట్టు చెప్పారు. ఈ పనులకు స్థానిక కార్మికులనే వినియోగిస్తామన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ 30 వేలకు పైగానే అభివృద్ధి పనులు చేపట్టేందుకు పల్లె పండుగ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు పవన్ చెప్పారు. చేతిలో డబ్బులు లేకపోతే.. సినిమాలు కూడా చూసే పరిస్థితి ఉండదన్నారు. అందుకే.. ప్రజల ఆర్థిక స్థిరత్వానికి పనికల్పన దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలిపారు. నాకు మొన్న ఒక విషయం తెలిసింది. గుడివాడ ఎమ్మెల్యే రాము గారు వచ్చి.. అక్కడి 43 గ్రామాల పరిస్థితి వివరించారు. నాకు చాలా బాధనిపించింది. అని పవన్ అన్నారు.
ఆ 43 గ్రామాల్లోనూ తాగేందుకు కూడా నీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్టు తనకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము వివరించారని పవన్ చెప్పారు. గత వైసీపీ హయాంలో అక్కడ మంత్రిగా పనిచేసిన ఎమ్మెల్యే ఈ పనులు ఎందుకు చేయలేదని అధికారులను ప్రశ్నించానన్నారు. అయితే.. సదరు ఎమ్మెల్యేకు బూతులు తిట్టడం, శాపనార్థాలు పెట్టడం తప్ప మరొకటి తెలియదని వారు చెప్పారని అన్నారు అందుకే ఇప్పుడు మార్పు దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు.
This post was last modified on October 15, 2024 12:12 am
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…
రాజకీయాల్లో విమర్శలు చేయొచ్చు. ప్రతివిమర్శలు కూడా ఎదుర్కొనచ్చు. కానీ, ప్రతి విషయంలోనూ కొన్ని హద్దులు ఉంటాయి. ఎంత రాజకీయ పార్టీకి…
ఏపీలో బీజేపీ-టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని గత 2024 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇప్పటికి 17 మాసాలుగా ఈ…