పోలవరం ప్రాజెక్టు ఏపీ ప్రజల జీవనాడి. దీనిని పూర్తి చేయాల్సింది కేంద్ర ప్రభుత్వం. అయితే.. కేంద్రంతో పెట్టుకుంటే ఆలస్యమవుతుందని భావించిన గత చంద్రబాబు సర్కారు దీనిని తామే వేగంగా పూర్తి చేసుకుంటామని.. నిధులు మీరిస్తే చాలని తేల్చి చెప్పారు. దీంతో కేంద్రం ఈ ప్రాజెక్టు విషయాన్ని ఏపీకే అప్పగించింది. అయితే.. నిధులు ఇచ్చే విషయంలో మాత్రం ఎప్పటికప్పుడు కొర్రీలు వేస్తూనే ఉంది. ప్రాజెక్టు అంచనాలు తగ్గించడం.. నిధులు ఇచ్చేందుకు అనే షరతులు పెట్టడం గతపదేళ్లుగా కనిపిస్తూ నే ఉంది.
అయితే.. తాజాగా ఏపీలోను, కేంద్రంలోనూ ఎన్డీయే సర్కారే ఏర్పడింది. అక్కడ టీడీపీ నేతలు మంత్రులు గా ఉంటే.. ఇక్కడ రాష్ట్రంలో బీజేపీకి చెందిన వారు మంత్రిగా ఉన్నారు. అంటే.. ఒకరకంగా.. ఎన్డీయే కూ టమే రెండు చోట్లా అధికారంలో ఉంది. మరి అలాంటప్పుడు.. పాలకులపై విశ్వసనీయత అనేది పార్టీల కు ఉండాలి. ముఖ్యంగా కేంద్రానికి ఏపీపై నమ్మకం ఉండాలి. మంత్రులు, ఇతర ఎమ్మెల్యేలపైనా నమ్మ కం ఉండాలి. కానీ, ఇప్పుడు పోలవరం విషయానికి వస్తే.. రాష్ట్ర సర్కారుకు కేంద్రం అనేక షరతులు పెట్టడం చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి పోలవరం ప్రాజెక్టు గత ఐదేళ్లలో వివిధ కారణాలతో ఇరుకున పడింది. గైడ్ బండ్ నుంచి క్షేత్ర స్థాయిలో పలు చోట్ల దెబ్బతింది. దీనిని సరిచేయడంతోపాటు.. ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చే యాలని.. రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఒకరకంగా చెప్పాలంటే ఈ బాధ్యత కేవలం టీడీపీదే కాదు.. కేంద్రంలోని బీజేపీది కూడా. ఎన్నికల సమయంలో పోలవరం పూర్తి చేస్తామని.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు. అయితే.. నిధుల విడుదలలో మాత్రం ఎడతెగని జాప్యం చేస్తోంది.
తాజాగా..
తాజాగా ఏపీ జలవనరుల శాఖ.. పోలవరానికి సంబంధించి అడ్వాన్సుగా రూ.7236 కోట్లు ఇవ్వాలని.. వర దల కారణంగా ధ్వంసమైన పనులను పూర్తిచేస్తామని నివేదిక పంపించింది. కానీ, దీనిలో అనేక కొర్రీలు వేసిన కేంద్రం కేవలం 2348 కోట్ల రూపాయలను మాత్రమే విడుదల చేసేందుకు అంగీకరించింది. దీంతో ఇలా చేయడం ఏంటి? అంటూ.. ఏపీ సర్కారు తలపట్టుకుంది. ఇంతలోనే ఈ ఇచ్చిన ఎమౌంటుకు కూడా.. అనేక షరతులు పెట్టడం మరింతగా సర్కారుకు ఇబ్బందిగా మారింది. ఇన్ని షరతులా? అని రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఇవీ.. షరతులు
+ ఇచ్చి సొమ్మును సంబంధిత పనులకే కేటాయించి ఖర్చుచేయాలి.
+ ప్రతి రూపాయికీ లెక్క చెప్పాలి.
+ ముందుగానే ఏయే పనులు చేస్తున్నారో నివేదికలు ఇవ్వాలి.
+ వృథా ఖర్చును కేంద్ర జాబితాలో వేయరాదు.
+ ప్రత్యేక అకౌంటును ప్రారంభించి.. దాని నుంచే డ్రా చేసుకోవాలి.
+ ప్రతి పనికీ రసీదులను ఇవ్వాలి. వీటిని పోలవరం అథారిటీకి సమర్పించాలి.
This post was last modified on October 11, 2024 3:07 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…