ఈ ఏడాది డిసెంబరు నుంచి రాజధాని అమరావతి నిర్మాణ పనులు పరుగులు పెడతాయని సీఎం చంద్రబాబు చెప్పారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు.
గత రెండు రోజులుగా తాను ఢిల్లీలో పలువురితో భేటీ అయ్యాన న్నారు. ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షా సహా పలువురిని కలుసుకున్నట్టు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధు లు.. సమస్యలపై చర్చించినట్టు చెప్పారు. పోలవరం, అమరావతికి సంబంధించిన అంశాలకు ప్రాధాన్యం ఇచ్చామని.. వాటిపైనే ఎక్కువగా చర్చించినట్టు సీఎం తెలిపారు.
గత ఐదేళ్లలో వైసీపీ హయాంలో రాష్ట్రం అన్ని విధాలా నష్టపోయిందని.. ఆయా విషయాలను ప్రధానంగా పీఎంకు వివరించానని చెప్పారు. కేంద్రం ఇచ్చిన పథకాలను కూడా జగన్ ప్రభుత్వం వినియోగించుకోలేదని చెప్పారు. దీనివల్ల రాష్ట్రం మరో పదేళ్లపాటు వెనుకబడి పోయిందన్నారు. తమ పాలనలో కేంద్రం నుంచి వచ్చే అన్ని పథకాలను సద్వినియోగం చేసుకుంటామని.. సామాజి క వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామని చెప్పారు. అమరావతిని పరుగులు పెట్టేందుకు ప్రపంచ బ్యాంకు నుంచి రుణాన్ని త్వరగా ఇప్పించాలని కోరినట్టు ముఖ్యమంత్రి తెలిపారు.
అదేవిధంగా విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు, పోలవరం నిర్మాణం వంటివి త్వరగా పూర్తి చేయాలని ప్రధానికి విన్నవించినట్టు సీఎం చంద్రబాబు చెప్పారు. పోలవరం ప్రాజెక్టుకు సంబందించి ప్రస్తుతం 2800 కోట్ల రూపాయలను కేంద్రం విడుదల చేసిందని, దీనికి ప్రధానికి ధన్యవాదాలు చెబుతున్నట్టు తెలిపారు. ఈ నిధులతో పాటు మరిన్ని నిధులు త్వరగా ఇవ్వాలని కోరినట్టు తెలిపారు. అదేవిధంగా పోలవరం డయాఫ్రం వాల్ నిర్మాణాన్ని కూడా త్వరగా చేపడతామని చెప్పారు.
ఐదేళ్ల విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రయ త్నిస్తున్నట్టు తెలిపారు. వైసీపీ హయాంలో చెత్తపైనా పన్ను వేసిన ఘనుడు జగనేనని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రబుత్వానికి సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని.. ఆ మేరకు తమ ప్రతిపాదనలను కేంద్ర మంత్రులు ఆసక్తిగా పరిశీలించారని.. రాష్ట్రానికి తగు న్యాయం చేస్తారని పేర్కొన్నారు.
This post was last modified on October 9, 2024 1:02 am
ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…
ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…
బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…
2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…
దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…
ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…