Political News

బీసీల‌కు పండ‌గ చేస్తున్నారా… బాబు ఆలోచ‌నేంటి…?

టీడీపీకి రాజ‌కీయంగా ఆది నుంచి అండ‌గా ఉన్న బీసీల‌కు మ‌రింత మేలు చేయాల‌ని సీఎం చంద్ర‌బాబు సంక‌ల్పించారు. ఎన్నిక‌ల‌కుముందు ఇచ్చిన హామీల మేర‌కు బీసీల జీవితాల్లో వెలుగులు నింపేలా ఆయ‌న నిర్ణ‌యించారు. ప్ర‌తి బీసీ కుటుంబానికీ మేలు చేయాల‌న్న‌ది చంద్ర‌బాబు సంక‌ల్పంగా ఉంది. ఈ క్ర‌మంలో దేశ‌వ్యాప్తంగా ఓబీసీల గ‌ణ‌న జ‌రుగుతున్నట్టుగానే.. ఇక్క‌డ బీసీల‌కు సంబంధించి లెక్క‌లు తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

క్షేత్ర‌స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా బీసీలు ఎంత మంది ఉన్నారు? వారి ఆర్థిక ప‌రిస్థితి ఏంటి? ఉద్యోగాలు, ఉపాధి వంటివాటిని తెలుసుకునేందుకు స‌ర్కారు రెడీ అయింది. ఢిల్లీకి లేదా చెన్నైకి చెందిన ప్ర‌తిష్టాత్మ‌క సంస్థ‌ల‌తో(ఇంకా ఫైనల్ కాలేదు) స‌ర్వే చేయించాల‌ని స‌ర్కారు నిర్ణ‌యించుకుంది. ఇది న‌వంబ‌రు తొలి వారం నాటికి పూర్తి అవుతుంద‌ని స‌మాచారం. క్షేత్ర‌స్థాయిలో బీసీల ప‌రిస్థితిని ఈ సంస్థ నిశితంగా అంచ‌నా వేయ‌నుంది.

త‌ద్వారా.. బీసీలు ఇప్పుడు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారు? వారికి ఎలాంటి మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పిం చాల‌నే విష‌యంపై చంద్ర‌బాబు దృష్టి పెట్టనున్నారు. ప్ర‌స్తుతం పొందుతున్న ఉపాధిని మ‌రింత నాణ్య మైన శిక్ష‌ణ ఇచ్చి.. అప్ గ్రేడ్ చేయాల‌న్న‌ది ఒక నిర్ణ‌యంగా ఉంది. ఇదేస‌మ‌యంలో ఉపాధి క‌ల్ప‌న‌తో పాటు యువ‌త‌కు ఉద్యోగాల క‌ల్ప‌న దిశ‌గా కూడా చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. గ‌తంలో బీసీల కోసం.. ప‌నిముట్లు ఇచ్చే ప‌థ‌కానికి శ్రీకారం చుట్టిన విష‌యం తెలిసిందే.

వారి వారి వృత్తుల‌ను బ‌ట్టి.. ప‌నిముట్ల‌ను ఉచితంగా అందించారు. అయితే.. ఇప్పుడు టెక్నాల‌జీ మ‌రింత వేగంగా విస్త‌రించిన నేప‌థ్యంలో వృత్తి ప‌నులు చేసుకునేవారికి నైపుణ్య శిక్ష ఇచ్చి.. సాంకేతిక‌త‌ను చేరువ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఫ‌లితంగా బీసీల ఆదాయం రెట్టింపు కావ‌డంతోపాటు.. వారి జీవ‌న స్థితిగ‌తులు కూడా మార్చాల‌ని చంద్ర‌బాబు నిర్ణ‌యించారు. ఈ ప‌రిణామాన్ని రాజ‌కీయ కోణంలో కాకుండా సామాజిక కోణంలో చేస్తుండ‌డం ఆహ్వానించ‌ద‌గిన ప‌రిణామం.

This post was last modified on October 8, 2024 6:37 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఇకపై ఆలస్యం చేయను – అల్లు అర్జున్

ఒకే సినిమాపై సంవత్సరాల తరబడి ఖర్చు చేయడం బాహుబలి నుంచే మొదలయ్యిందని చెప్పాలి. గతంలో అంజి, అమ్మోరు లాంటివి సుదీర్ఘ…

2 hours ago

పుష్ప 2 సెన్సార్ అయిపోయిందోచ్ : టాక్ ఎలా ఉందంటే…

ఐకాన్ స్టార్ అభిమానులే కాదు సగటు ప్రేక్షకులు కూడా విపరీతమైన ఆసక్తితో ఎదురు చూస్తున్న పుష్ప 2 ది రూల్…

5 hours ago

అప్పట్లో శ్రీలీల డేట్స్ అంటే పెద్ద ఛాలెంజ్, కానీ ఇప్పుడు…

బిజీ హీరోయిన్ల డేట్లను షెడ్యూల్స్ తగట్టు తెచ్చుకోవడం దర్శక నిర్మాతలకు ఒక్కోసారి పెద్ద సవాల్ గా మారుతుంది. అంత డిమాండ్…

5 hours ago

బోల్డ్ ఫోటోషూట్ తో కట్టి పడేస్తున్న మిల్కీ బ్యూటీ!

2007 లో విడుదలైన హ్యాపీ డేస్ మూవీతో కుర్ర కారులో విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న మిల్కీ బ్యూటీ తమన్న. అగ్ర…

6 hours ago

ఆర్సీబీకి ‘హిందీ’ సెగ.. తెలుగు లేదా?

దేశవ్యాప్తంగా హిందీ భాషను రుద్దాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోందంటూ తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. తమిళనాట…

6 hours ago

నా రికార్డింగ్స్ వాడుకుంటే నీకైనా నోటీసులే : వెట్రి మారన్ తో ఇళయరాజా!

ఇళయరాజా పేరు ఈ మధ్య కాలంలో తరచుగా వివాదాలతోనే వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. వయసు మీద పడడంతో ఆయన…

6 hours ago