ఈ మధ్య వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌కు, దివ్వెల మాధురి అనే వివాహితకు మధ్య సంబంధం గురించి ఎంత రచ్చ జరిగిందో తెలిసిందే. శ్రీనివాస్ తమ కుటుంబాన్ని పట్టించుకోకుండా, ఇంటిని వదిలేసి వెళ్లిపోయాడని.. మాధురి ఇంట్లోనే ఉంటున్నాడని శ్రీనివాస్ భార్య వాణి, కూతుళ్లు చేసిన ఆరోపణల మీద రచ్చ రచ్చ జరిగింది.
శ్రీనివాస్ భార్యాబిడ్డలను బూతులు తిట్టడంతో పాటు వారి మీద దాడికి కూడా ప్రయత్నించాడు. కొన్ని వారాల పాటు దీని మీద మీడియాలో రచ్చ రచ్చ అయింది. శ్రీనివాస్, మాధురి తమ బంధం గురించి దాదాపుగా ఓపెన్ అయిపోయారు. మరోవైపు మాధురి భర్తేమో తన భార్యను అనుమానించాల్సిన అవసరం లేదని.. ఆమె మీద రాజకీయంగా కుట్ర జరుగుతోందని అన్నారు.
కట్ చేస్తే ఇప్పుడు శ్రీనివాస్, మాధురి తమ బంధాన్ని దాచి పెట్టే ప్రయత్నం ఏమీ చేయట్లేదు. ఎవరేం అనుకుంటే ఏం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరూ కలిసి తిరుమల వెళ్లారు. తాజాగా ఈ జంట బ్రాండ్ ప్రమోషన్లకు కూడా రెడీ అయిపోవడం విశేషం.
టెక్కలిలో ఓ ఎలక్ట్రిక్ బైక్‌కు వీళ్లిద్దరూ ప్రచారం చేసిపెట్టిన వీడియో వైరల్ అవుతోంది. శ్రీనివాస్ ఆ కొత్త బైక్ మీద మాధురిని ఎక్కించుకుని తిప్పుతూ కనిపించగా.. మాధురి ఈ బైక్ గురించి, షోరూమ్ ఆఫర్ల గురించి ఇంట్రో ఇచ్చింది. తనకీ బైక్ ఎంతో నచ్చిందని.. దీని మీద మంచి ఆఫర్ ఇస్తున్నారని దీని గురించి వినియోగదారులను ఆకర్షించే ప్రయత్నం చేసింది. మరోవైపు శ్రీనివాస్‌కు ఇష్టమైన వంటకం అంటూ మునక్కాయ సాంబార్ గురించి ఓ న్యూస్ ఛానెల్‌లో వీడియో కూడా చేసింది మాధురి.
This post was last modified on October 7, 2024 9:41 pm
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…
బడ్జెట్ రెండు వందల ఎనభై కోట్ల పైమాటే. అదిరిపోయే బాలీవుడ్ క్యాస్టింగ్ ఉంది. యాక్షన్ విజువల్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్…
చిన్నదా..పెద్దదా..అన్న విషయం పక్కనబెడితే..దొంగతనం అనేది నేరమే. ఆ నేరం చేసిన వారికి తగిన శిక్ష పడాలని కోరుకోవడం సహజం. కానీ,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…