తమిళనాడు వ్యవహారంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందిస్తూనే ఉన్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధిని ఉద్దేశించి తిరుపతిలో నిర్వహించిన వారాహి బహిరంగ సభలో సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత.. అటు వైపు నుంచి పెద్దగా స్పందన రాలేదు. ‘వేచి చూస్తున్నాం’ అని మాత్రమే ఉదయనిధి పేర్కొన్నారు. కానీ, పవన్ వైపు నుంచి నిరంతరం ట్వీట్ రూపంలో తమిళనాడు గురించి కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. తిరుపతి సభ తర్వాత.. వరుసగా మూడో రోజు కూడా పవన్ ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ఆయన తమిళనాడును సనాతన ధర్మానికి ప్రతీకగా, వేదికగా చూపించే ప్రయత్నం చేశారు. తాజాగా చేసిన ట్వీట్‌లో తమిళనాడు సిద్ధసాధువలకు పురుటి గడ్డగా పేర్కొన్నారు. పునీత భూమి అని వ్యాఖ్యానించారు. తమిళనాడు గడ్డపై అనేక మంది సాధువులు, సత్సంగులు జన్మించారని..అనేక మంది ఈ గడ్డపైనే జీవించారని పవన్ పేర్కొనడం ద్వారా.. ఉదయ నిధికి బలమైన వ్యాఖ్యలు చేరవేస్తున్నట్టు అయింది. తమిళనాడు సనాతనధర్మానికి వేదికగా ఉందన్న బలమైన వాదనను కూడా ఆయన పంపిస్తున్నారు. ఇదేసమయంలో తన కుటుంబానికి చెందిన విషయాలను కూడా పవన్ పేర్కొన్నారు.
“మా నాన్న(వెంకట్రావు) రామకృష్ణ పరమహంస, శారదామా, వివేకానందనలను ఆరాధించేవారు. అప్పట్లోనే మా నాన్న రాంచీ వెళ్లి ‘క్రియా యోగ’ దీక్ష చేపట్టారు. తర్వాత మాకు కూడా క్రియా యోగను పరిచయం చేశారు. 1980ల చివర్లో, 1990వ దశకం ఆరంభంలో మా నాన్న చెన్నైలోని శాంథోమ్ వెళ్లి మహావతార్ బాబాజీ ఆశ్రమాన్ని సందర్శించారు. ఆయన తరచుగా తిరువణ్ణామలై వెళ్లి యోగి రామ్ సూరత్ కుమార్ సేవలో పాల్గొనేవారు” అని పవన్ వివరించారు. ఈ క్రమంలోనే ఆయన తమిళనాడును పుణ్యభూమిగా, పునీత భూమిగా పేర్కొన్నారు.
తాజాగా పవన్ చేసిన కామెంట్లు తమిళనాడులో అధికార పార్టీ డీఎంకేకు ఇబ్బందికర పరిణామాలను తెచ్చినట్టే అయింది. ఎందుకంటే.. నాస్తికత్వాన్ని అనుసరించే డీఎంకే సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబాలు(సీఎం భార్య దుర్గ మాత్రం ఆస్తికురాలు) ఈ వ్యాఖ్యలపై స్పందించేందుకు సాహసం చేస్తాయా? అనేది చూడాలి. అంతేకాదు.. తమిళనాడును సనాతన ధర్మానికి ప్రతీకగా పేర్కొన్న పవన్‌పై ఎదురు దాడి చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. ఒకవేళ ఎదురు దాడి చేస్తే.. తమిళనాడును పుణ్యభూమి కాదని చెప్పినట్టే అవుతుంది. సో.. ఎలా చూసుకున్నా పవన్.. డీఎంకేను ఇరకాటంలోకి నెట్టేశారనే చెప్పాలి.
This post was last modified on October 6, 2024 9:32 pm
ఏపీలో వైసీపీ నాయకులను కూటమి పార్టీలు చేర్చుకుంటున్న విషయం తెలిసిందే. అయితే..ఇప్పటి వరకు కూటమిలోని టీడీపీ, జనసేన మధ్యే ఈ…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలు అనేక ఇబ్బందులు సృష్టించాయి. మూడు రాజధానుల పేరుతో ఆయన నవ్యాంధ్ర…
ప్రముఖ సీనియర్ నటుడు, నిర్మాత, వ్యాపార వేత్త మురళీమోహన్.. తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్‌రెడ్డితో సినీ…
తిరుమల శ్రీవారి దర్శనం అంటే.. ఓ 2 నిమిషాలు లభిస్తుందని అనుకునే రోజులు ఎప్పుడో పోయాయి. అన్నగారు ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా…
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (92) కన్నుమూశారు. శ్వాస కోస సంబంధిత సమస్యలతో తీవ్ర అస్వస్థతకు గురైన మన్మోహన్…