వైసీపీ అధినేత జగన్.. తాజాగా ట్వీట్ చేశారు. దీనిలో 10 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియోను పోస్టు చేశా రు. దీనికి ముందు.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిన తర్వాత కూడా.. చంద్రబాబు తిరుమల రాజకీయా లు మానుకోవడం లేదని, మారడం లేదని వ్యాఖ్యానించారు.
ఇక, ఈ పోస్టును దేశవ్యాప్తంగా అన్ని మీడి యా చానెళ్లకు, అదేవిధంగా ఎన్డీయేతర పార్టీలకు కూడా పంపించారు. దీనిలో బీఆర్ ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, ఆ పార్టీ మాజీ మంత్రి కేటీఆర్ కూడా ఉన్నారు.
ఇక, ఉత్తరాది పార్టీలైన ఎస్పీ, బీఎస్పీ, ఆప్ సహా అనేక పార్టీలను జగన్ ట్యాగ్ చేశారు. `మీరంతా చూడండి. పట్టించుకోండి“ అన్నట్టుగా ఆయన ప్రాథేయ పడ్డారు. ఇక, వీడియోలో యథాలాపంగా.. సుప్రీంకోర్టు గత నెల 30న చేసిన కామెంట్లను, అప్పట్లో జాతీయ మీడియా ప్రచురించిన వార్తలను చదివి వినిపించారు.
అదేవిధంగా తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సుప్రీంకోర్టు నియమించిన విషయాన్ని కూడా జగన్ చెప్పుకొచ్చారు. దీనిలో కొత్తగా జగన్ చెప్పింది ఏమీలేదు.
అయితే.. తన బాధను ప్రపంచం పట్టించుకోవడం లేదన్న ఆవేదనే ఆయనలో కనిపిస్తుండడం గమనా ర్హం. తిరుమల లడ్డూ ప్రసాదం కల్తీ విషయంలో వైసీపీకి భారీ డ్యామేజీ అయితే ఏర్పడింది. దీని నుంచి బయటకు రాలేక పోతున్న పరిస్థితి ఏర్పడుతోంది. ఈ నేపథ్యంలోనే సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను జగన్ పదే పదే గుర్తు చేస్తున్నారు.
దీనికి చంద్రబాబును బూచిగా చూపిస్తూ.. సుప్రీంకోర్టు మొట్టికాయలు వేశాక కూడా వారిలో మార్పురాలేదన్న భావనను ప్రచారం చేస్తున్నారు. మొత్తంగా జగన్ బాధ ప్రపంచానికి బాధగా మారాలని ఆయన భావిస్తున్నట్టు స్పష్టంగా కనిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on October 5, 2024 3:32 pm
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…
కేంద్ర హోం శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలోని జీఎస్టీ మండలి సమావేశంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కాలక్షేపానికి తినే…
తెలంగాణ అసెంబ్లీలో టాలీవుడ్ కు సంబంధించి ఎప్పుడూ జరగనంత వాడి వేడి చర్చ ఇవాళ కనిపించడం ఇండస్ట్రీ వర్గాలనే కాదు…
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్.. ఇటు బీజేపీకి, అటు హిందూ సంఘాలకు కూడా.. ఐకాన్. ఆయన…