రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి నాలుగు మాసాలు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో `ప్రజా ప్రభుత్వం `పై సామాన్యుల టాక్ ఎలా ఉందనేది ఆసక్తిగా మారింది. ఈ ఆసక్తి కేవలం మేధావులు, విశ్లేషకుల్లోనే కాదు.. కూటమి సర్కారులోనూ ఎక్కువగా కనిపిస్తోంది. మరీ ముఖ్యంగా ఎప్పటికప్పుడు తన గ్రాఫ్‌ను అంచనా వేసుకునే సీఎం చంద్రబాబు.. ఇప్పుడు సామాన్యుల శాటిస్పాక్షన్‌పై దృష్టి పెట్టారు. ఈ వంద రోజుల పాలనలో తమ పరిస్థితిపై ప్రజలు ఏమనుకుంటున్నారన్న విషయాన్ని కలెక్టర్ల ద్వారా ఆయన రాబడుతున్నారు.
వాస్తవానికి కలెక్టర్లు ఇచ్చే నివేదిక ప్రామాణికం కాదు. ఎందుకంటే.. క్షేత్రస్థాయిలో పరిస్థితి ఎలా ఉన్నా.. వారు సర్కారుకు అనుకూలంగానే నివేదికలు ఇస్తారు. అయితే.. ఇది ప్రాథమికమేనని.. తర్వాత.. దీనిని బట్టి క్షేత్రస్థాయిలో పరిశీలన ఉంటుందని సీనియర్ నాయకుడు ఒకరు మీడియాకు చెప్పారు. కాగా, కలెక్టర్ల ద్వారా ఎలా ఈ అభిప్రాయ సేకరణ చేస్తారనేది ప్రశ్న. దీనికి కూడా ప్రభుత్వం కొన్ని మార్గదర్శనా లు చేసింది. వాటి ప్రకారం.. సామాన్యుల శాటిస్‌ఫ్యాక్షన్‌పై నిర్ణయం తీసుకుంటున్నారు.
1) కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సమస్యల పరిష్కారం. దీని ప్రకారం.. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత.. సామాన్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే విషయంలో సర్కారు దూకుడుగా ఉం ది. ప్రతి ఎమ్మెల్యే, ఎంపీ సహా మంత్రి కూడా ప్రజాదర్బార్‌లు పెట్టి ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తున్నా రు. వీటి పరిష్కారం విషయాన్ని కూడా సీరియస్‌గా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రజల శాటిస్‌ఫ్యాక్షన్‌ను అంచనా వేయనున్నారు.
2) ప్రభుత్వ సేవలు. ప్రభుత్వం నుంచి ప్రజలకు అందుతున్న సేవలు కూడా త్రూ కలెక్టర్ల ద్వారానే జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా సేవలకు సంబంధించి ప్రజలు ఎలా ఫీలవుతున్నారన్న విషయాన్ని కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు .. క్షేత్రస్థాయిలో పరిశీలించి.. ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. అయితే.. ప్రస్తుతం ప్రభుత్వం నుంచి అందుతున్న సేవలను గమనిస్తే.. ఇంటింటికీ ఫించను మాత్రమే అందుతోంది.
ఇంకా, ప్రభుత్వం పథకాలను ప్రారంభించలేదు. ఇక, పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలవుతోంది. ఇది కామన్‌గా జరిగేదే. దీంతో ప్రస్తుతం జరుగుతున్న అందుబాటులో ఉన్న అంశాలపైనే కలెక్టర్లు నివేదిక ఇచ్చేలా సీఎం చంద్రబాబు ఆదేశించారు. దీని ప్రకారం.. ప్రజల నాడిని గుర్తించి.. వచ్చే 100 రోజులకు ప్లాన్ చేసుకునేలా చంద్రబాబు వ్యూహం సిద్ధం చేసుకున్నట్టు తెలిసింది.
This post was last modified on October 5, 2024 3:31 pm
ఫిలిం ఇండస్ట్రీలో ప్రేమాయణాలు.. బ్రేకప్‌లు సర్వ సాధారణమే. ఐతే బాలీవుడ్లో ఈ ఒరవడి ఎక్కువ కాగా.. సౌత్ ఇండస్ట్రీల్లో కొంచెం…
మన దేశంలో చాలామంది ఆడవాళ్లు సాధారణంగా ఐదు పదుల వయసు తర్వాత ఏ టీవీ సీరియల్సో చూసుకుంటూ మనవళ్లతో ఆడుకుంటూ…
సుకుమార్ సినిమా అంటే ఐటెం సాంగ్ మాండేటరీ. ‘1 నేనొక్కడినే’ లాంటి సీరియస్ థ్రిల్లర్లో కూడా ఆయన ఐటెం సాంగ్…
టీడీపీ ఫైర్ బ్రాండ్లకు సీఎం చంద్రబాబు మరింత పెద్ద పీట వేశారు. వారికి ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడంతో పాటు.. తాజాగా…
కనుమూరు రఘురామ కృష్ణంరాజు తెలుగు రాజకీయాల్లో ఎలాంటి సంచలనమో… ఎంత పాపులరో తెలిసిందే. మరీ ముఖ్యంగా గత ఐదేళ్లు వైసీపీ…
రేపు విడుదల కాబోతున్న కంగువకు కష్టాల పరంపర కొనసాగుతోంది. తమిళనాడులో అమరన్ స్ట్రాంగ్ గా ఉండటం వల్ల మూడో వారంలోనూ…