ప‌వ‌న్ – స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ ప్ర‌జ‌ల‌కు ఎంత వ‌ర‌కు ఎక్కింది..!

అతి స‌ర్వ‌త్ర వ‌ర్జ‌యేత్‌! అంటుంది ‘స‌నాత‌న ధ‌ర్మం’. అతిగా ఏ విష‌యంపైనా స్పందించ‌కూడ‌ద‌నేది ఈ ధ‌ర్మం చెబుతున్న మాట‌. అంతేకాదు.. ఓం శాంతి! శాంతి!! శాంతి!!– అనేది కూడా స‌నాత‌న ధ‌ర్మం చెప్పే అతి పెద్ద సూత్రం. ఒక్క స‌నాత‌న ధ‌ర్మంలో త‌ప్ప ఈ మాట మ‌రే ధ‌ర్మంలోనూ లేద‌నేది అంద‌రికీ తెలిసిందే. అంతేకాదు.. స‌నాత‌న ధ‌ర్మం చెబుతున్న మరో కీల‌క మాట‌.. స‌హ‌నాభ‌వ‌తు. స‌హ‌నౌ భుణ‌త్తు. స‌హ‌వీర్యం క‌ర‌వావ‌హై!!

మొత్తంగా చూస్తే.. స‌నాత‌న ధ‌ర్మం చెప్పేది.. చెబుతున్న‌దీ.. చెప్పిందీ.. ‘స‌హ‌నం-శాంతి!’ ఈ రెండే స‌నా త‌న ధ‌ర్మానికి మూల స్తంభాలు. ఈ రెండు కోల్పోయిన‌నాడే స‌నాతన ధ‌ర్మం త‌న అస్తిత్వాన్ని కోల్పోతుంద ని ఎన్న‌డో చెప్పారు స్వామి వివేకానంద‌. అందుకే నిన్ను నువ్వు తెలుసుకో! అనే మాట వ‌చ్చింది. స‌రే.. ఇవ‌న్నీ ఇప్పుడు ఎందుకంటే.. స‌నాత‌న ధ‌ర్మంపై ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన‌.. చేస్తున్న వ్యాఖ్య‌ల‌పై ప‌బ్లిక్ టాక్ భిన్నంగా ఉండ‌బ‌ట్టే.

తాజాగా నిర్వ‌హించిన వారాహి స‌భ‌లో ప‌వ‌న్ మ‌రోసారి ఎన్నిక‌ల త‌ర్వాత రెచ్చిపోయి ప్ర‌సంగించారు. స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ త‌క్ష‌ణావ‌స‌రంగా ఆయ‌న చెప్పుకొచ్చారు. దీనికోసం తాను చావ‌నైనా చ‌స్తాన‌ని కూడా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. అయితే.. పవ‌న్‌తోనే స‌నాత‌న ధ‌ర్మం రాలేదు.. ఆయ‌న‌తోనే పోదు కూడా. త‌ర‌త‌రాలుగా స‌నాతన ధ‌ర్మం న‌డుస్తూనే ఉంది. అయితే.. ఒడిదుడుకులు ఎప్పుడూ ఎదుర‌య్యాయి. ఆ మాట‌కొస్తే.. అన్ని మ‌తాల‌కు.. ఇవి కామ‌నే. మ‌న ద‌గ్గ‌ర‌లేదు కానీ.. పాశ్చాత్య దేశాల్లో క్రిస్టియ‌న్లు.. ఇత‌ర మ‌తాల‌ను అనుస‌రిస్తున్న విష‌యం.. దీనిపై పెద్ద ఎత్తున వివాదాలు, విమ‌ర్శ‌లు వ‌స్తున్న విష‌యం ప‌వ‌న్‌కు తెలియంది కాదు.

అలానే.. ఎప్పుడు పుట్టిందో తెలియ‌ని స‌నాత‌న ధ‌ర్మంపైనా.. మెజారిటీ ప్ర‌జ‌లు అనుస‌రించే ధ‌ర్మంపైనా ఎప్పుడూ ఏదో ఒక రూపంలో దాడి జ‌రుగుతూనే ఉంటుంది. జ‌రిగింది కూడా. ఇది చ‌రిత్ర చెప్పిన వాస్త‌వం. మ‌హ‌మ్మ‌దీయుల నుంచి తుర‌ష్కుల వ‌ర‌కు హిందూ ధ‌ర్మంపై దాడి చేయ‌ని మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తులు లేరు. ఎక్క‌డొ ఒక‌రిద్దు త‌ప్ప‌. కాబ‌ట్టి.. ఇప్పుడు ఇంత సీరియ‌స్‌గా వ్యాఖ్య‌లు చేసినా.. వాటిని ఏమేర‌కు ఆచ‌ర‌ణ‌లో పెడ‌తార‌నేది చ‌ర్చ‌నీయాంశం. ప‌వ‌న్‌ కోరుకుంటున్న‌ట్టు స‌నాత‌న ధ‌ర్మ ప‌రిర‌క్ష‌ణ‌కు ప్ర‌త్యేక చ‌ట్టం చేయ‌డం సాధ్య‌మేనా? అనేది ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. మ‌న దేశం సెక్యుల‌ర్(లౌకిక‌వాదం) కంట్రీ. ఇది రాజ్యాంగ పీఠిక‌లోనే ఉంది. స‌ర్వ‌మ‌త స‌మాన‌త్వం అనే మాట‌ను రాజ్యాంగంలోని 25వ ఆర్టిక‌ల్ స్ప‌ష్టం చేస్తోంది. ఇప్పుడు ప‌వ‌న్ కోరుకుంటు న్నట్టుగా చ‌ట్టం తీసుకువ‌స్తే.. ఇత‌ర మ‌తాలు చిన్న‌వి, స‌నాత‌న ధ‌ర్మం మాత్రం క్రీమీలేయ‌ర్ గా ప్ర‌భు త్వం ఒప్పుకొన్న‌ట్టుగా అవుతుంది. కానీ, ఇది సాధ్యం కాదు. అదేవిధంగా బ‌డ్జెట్ నిధులు కేటాయించాల‌ని కూడా ప‌వ‌న్ అన్నారు. ఇది కూడా సాధ్యం కాదు.

అంద‌రూ క‌లిసి, అన్ని మ‌తాలు, కులాల వారు క‌లిసి క‌డుతున్న ప‌న్నుల సొమ్మును ప్ర‌భుత్వం ఏదైనా ఒకే మ‌తానికి వెచ్చిస్తామ‌ని బ‌డ్జెట్ రూపంలో తీసుకురావడాన్ని రాజ్యాంగం, ఆర్థిక సూత్రాలు కూడా అంగీక‌రించ‌వు. సో.. ఇవేవీ ప‌వ‌న్‌కు తెలియ‌ని అనుకోవాలా? అనేది ప్ర‌శ్న‌. సో.. ఎలా చూసుకున్నా.. ప‌వ‌న్ చెబుతున్న స‌నాత‌న ధ‌ర్మం లెక్క‌లు ఆయ‌న‌కే తెలియాల‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.