తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి అధికార పార్టీ టీడీపీ మరో కీలక విషయా న్ని వెలుగులోకి తీసుకువచ్చింది. సరుకు లేని కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చిన వ్యవహారాన్ని తూర్పార బట్టిం ది. ఉదాహరణకు 100 కిలోల బస్తా మోసే వ్యక్తిపై 1000 కిలోలు మోపిన చందంగా వైసీపీ వ్యవహరించింది. తిరుమలకు నెయ్యి సరఫరా చేసేందుకు పలు కంపెనీలను ఎంచుకున్న వైసీపీ ప్రభుత్వం.. పెద్దగా అనుభవం లేని తమిళనాడుకు చెందిన ఏఆర్ ఇండస్ట్రీను ఎంచుకుంది.
పైగా ఈ సంస్థకు తిరుమల వంటి పెద్ద క్షేత్రానికి భారీ స్థాయిలో నెయ్యి అందించే సామర్థ్యం లేదని ఇప్పుడు టీడీపీ నాయకులు ఆధారాలతో సహా బట్టబయలు చేశారు. తిరుమల నెయ్యి సహా ఇతర సరుకుల కాంట్రాక్టును ఏటా ఏప్రిల్-మే మధ్య కాంట్రాక్టు ఇస్తుంటారు. దీనికి సంబంధించిన ప్రక్రియను ఆరు మాసాల ముందే ప్రారంభిస్తారు. ఇలానే ఈ ఏడాది మే 15న ఏఆర్ పుడ్ ఇండస్ట్రీస్‌కి టీటీడీ ఆర్డర్ ఇచ్చింది. జూన్ 11న ఒప్పందం కూడా చేసుకుంది.
మొత్తం 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసుకునేలా ఈ ఒప్పందం ఉన్నదని టీడీపీ చెబుతోంది. కానీ, ఏఆర్ సామర్థ్యం.. సరుకు ఇచ్చే స్థాయి మాత్రం అంత లేదు. నెలకు కేవలం 16 టన్నుల నెయ్యిని మాత్రమే ఈ సంస్థ తిరుమలకు ఇచ్చే స్థాయిలో ఉంది. ఇలా చూసుకుంటే.. ఆరు మాసాలకు కేవలం 96 టన్నుల నెయ్యిని మాత్రమే ఈ సంస్థ అందిస్తుంది. అయితే.. వెయ్యి టన్నుల మేరకు కాంట్రాక్టు ఇవ్వడం విస్మయాన్ని కలిగిస్తోంది.
ఈ క్రమంలోనే ఆ సంస్థ తప్పిదాలకు పాల్పడి ఉంటుందన్న చర్చ కూడా టీడీపీ తెరమీదికి తెచ్చింది. నిజానికి 2022లో కుదిరిన ఒప్పందం మేరకు ఈ సంస్థ 15 టన్నులు మాత్రమే సరఫరా చేసింది. ఆ తర్వాతే.. ఇది 16 టన్నులకు పెంచారు. అది కూడా నెల ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారు. అంటే.. అసలు సామర్థ్యం లేని కంపెనీకి ఇంత సరుకు ఇవ్వడంలోనే ఎక్కడో తేడా కొడుతోందన్నది టీడీపీ నేతుల చెబుతున్న మాట. దీనిపైనే విచారణ చేయాలన్నది కూడా వారి డిమాండ్. మరి ప్రభుత్వం ఏం చేస్తుందో చూడాలి.
This post was last modified on October 3, 2024 7:58 pm
"ఈ ఒక్క ఎన్నికల్లో చంద్రబాబును అడ్డుకుంటే చాలు. ఇక, 30 ఏళ్లపాటు మనకు తిరుగు ఉండదు" - అని వైసీపీ…
దక్షిణకొరియాలో మువాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన ఘోర ప్రమాదం ప్రపంచాన్ని కలిచివేసింది. ఆదివారం ఉదయం ‘జెజు ఎయిర్’కు చెందిన ప్యాసింజర్…
వైసీపీ అధినేత జగన్కు 2024 భారీ షాకేనని చెప్పాలి. పార్టీ ఓటమి, కీలక నాయకుల జంపింగులతో ఆయన ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.…
దేశంలో 31 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. వీరిలో కేంద్ర పాలిత ప్రాంతాలైన ఢిల్లీ సహా.. ఇతర రాష్ట్రాలకు చెందిన వారు…
మరో సంవత్సరం ముగిసింది. కొత్త ఆశలతో స్వాగతం పలికేందుకు 2025 తయారయ్యింది. ముఖ్యంగా ప్యాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్ అడ్రెస్…
జనసేన పార్టీ 2014లో ఆవిర్భవించినా.. ఆ తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి పెద్దగా ప్రాధాన్యం లేకుండా…