తెలంగాణ సీనియర్ నాయకురాలు, మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించేందుకు రంగం రెడీ అయిందంటున్నారు. బీఆర్ ఎస్ నాయకుడు, మాజీ మంత్రి కేటీఆర్ ను కేంద్రంగా చేసుకుని ఆమె చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. అన్ని వర్గాల నుంచి కూడా కాంగ్రెస్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నా యి. ముఖ్యంగా నటి సమంత విషయంలో సురేఖ చేసిన వ్యాఖ్యలను పార్టీలకు అతీతంగా అందరూ ఎండగడుతున్నారు. ఇలాంటి వ్యాఖ్యలు సబబు కాదని అందరూ చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో సెగ మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా సురేఖకు వ్యతిరే కంగా ధర్నాలు, నిరసనలకు బీఆర్ ఎస్ పక్కా ప్లాన్ చేస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ కూడా మీడియా ముందుకు రానున్నారు. అంతేకాదు.. నిరసనల్లో ఆయన కూడా పాలు పంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. దీంతో సురేఖ అంశం.. మరింత వేడెక్కనుంది. ఇప్పటి వరకు అనేక విమర్శలు వచ్చినా.. సర్కారు తరఫున సీఎం రేవంత్ సరిదిద్దుకుంటూ వస్తున్నారు.
గతంలో నెల రోజుల కిందట.. మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.. అసెంబ్లీలోనే తనను దూషించారంటూ.. కన్నీరు పెట్టుకున్నారు. అప్పట్లోనే మహిళలను కించపరుస్తున్నారంటూ బీఆర్ ఎస్ ఉద్యమించింది. దానిని సరిదిద్దుకునేందుకు సీఎం రేవంత్ స్పందించారు. అది సమసి పోయిందని భావిస్తున్న సమయం లో అనూహ్యంగా కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు మరింత మంట పుట్టిస్తున్నాయి. ఈ వ్యాఖ్యలు అన్ని వర్గాలకు చేరిపోయాయి. ఇలాంటి సమయంలో వీటిని సరిదిద్దుకునేందుకు మాటలు చెబితే సరిపోదని సీఎం భావిస్తున్నట్టు తెలుస్తోంది.
దీనికి ప్రతిగా సురేఖను మంత్రి వర్గం నుంచి తప్పించడం తప్ప.. రేవంత్ ముందున్న ప్రత్యామ్నాయం మరొకటి కనిపించడం లేదు. ఒకవైపు హైడ్రా దూకుడుతో సామాన్యుల్లో సర్కారుపై వ్యతిరేకత పెరిగింది. దీనిని తప్పించుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. ఇక, ఇప్పుడు సురేఖ ఇష్యూ మహిళా ఓటు బ్యాంకుపై ప్రభావం చూపించేలా కనిపిస్తోంది. ఇదే జరిగితే.. ఎంత మంచి పాలన అందించినా ప్రయోజనం లేదని రేవంత్ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో తన మంత్రి వర్గం నుంచి సురేఖను పక్కన పెట్టేస్తారని సీఎంవో వర్గాలు సైతం చెబుతుండడం గమనార్హం. త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉన్న నేపథ్యంలో సురేఖ స్థానంలో వేరేవారికి అవకాశం దక్కనుందని సమాచారం. దీనిపై ఈ రోజు లేదా రేపటిలోనే సీఎం రేవంత్ ప్రకటన చేయనున్నట్టు పార్టీలో చర్చ సాగుతోంది.
This post was last modified on October 3, 2024 10:12 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…