రాజకీయాల్లో విమర్శలు కామన్. ప్రత్యర్థులపై నిప్పులు చెరగడం కూడా పరిపాటే. ఇవి లేకపోతే రాజకీయాల్లో మజానే ఉండదు. కానీ, వ్యక్తిగత విషయాలు.. అసంబద్ధమైన వ్యవహారాలు.. సమాజం సిగ్గుపడే అంశాలు కూడా రాజకీయం అయిపోతే..? ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. సమాధానం లభించని ప్రశ్న. దీనికి కేరాఫ్ తెలంగాణ మంత్రి, మహిళా నాయకురాలు.. రాజకీయంగా సుదీర్ఘ అనుభవం ఉన్న కొండా సురేఖ!. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్‌పై అక్కసు ఉండొచ్చు.. మాజీ మంత్రి కేటీఆర్ వ్యవహార శైలిపైనా ఆక్రోశం ఉండొచ్చు.. అలాగని ఎలా పడితే అలా.. నోరు చేసుకుంటారా? అనేది కీలక ప్రశ్న.
రాజకీయాలతో సంబంధం లేదని అక్కినేని కుటుంబాన్ని సంతలో సరుకులా రోడ్డుకు లాగేసిన తీరు సర్వత్రా విస్మయాన్ని కలిగిస్తోంది. పైగా తన మానాన తను పనిచేసుకుంటూ జీవిస్తున్న సమంతను రాజకీయాల్లోకి లాగేయడం.. కేటీఆర్ చుట్టూ తీవ్ర విమర్శలకు ఆమెను కలిపేయడం వంటివి మరింత జుగుప్సాకరంగా మారాయి. ఇంత అనుభవం ఉండి…ఎంతో ఆలోచనా పరురాలై ఉండి కూడా కొండా సురేఖ ఇలా దారి తప్పేస్తారని ఎవరూ ఊహించరు. అందుకే తెలంగాణ సమాజం ఆమె చేసిన వ్యాఖ్యలు విన్నాక.. ఆమెను చూశాక.. నివ్వెరపోతోంది. ఈ ప్రభావం సుదీర్ఘ కాలం సురేఖను పట్టి పీడించడం ఖాయం.
నిజానికి సురేఖ చెప్పిన విషయంలో వాస్తవం ఉంటుందా? లేదా? అనేది పక్కన పెడితే.. ఆమె ప్రస్తావించిన సమంత-కేటీఆర్-నాగార్జున-నాగచైతన్యల వ్యవహారం.. పూర్తిగా అసంబద్ధమైన వ్యవహారాలు. ఇవి సభ్యసమాజానికి కూడా చెడు సంకేతాలు ఇచ్చే వ్యాఖ్యలు. అసలు ఏం జరిగిందో తెలియకుండా.. తనకు నోటికి వచ్చిందని సురేఖ చెప్పుకొచ్చారు. కానీ, దీని పర్యవసానాలు మాత్రం తీవ్రంగానే ఉంటాయని పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు సురేఖ అంటే సింపతీ చాలానే ఉంది. ఆమె అనేక పార్టీలు మారినా.. అనేక జెండాలు కప్పుకొన్నా.. వరంగల్ వాసులు హర్షించారు. నెత్తిన పెట్టుకున్నారు.
కానీ, పోయి పోయి,.. సాటి మహిళ, పైగా విడాకులతో కుంగిపోయి.. మౌనంగా ఉన్న సమంత జీవితాన్ని.. అదేసమయంలో సభ్య సమాజంలో గౌరవంగా బతుకుతున్న అక్కినేని కుటుంబాన్ని కూడా రోడ్డుకులాగేసిన తీరు.. సురేఖ ఔచిత్యాన్ని, ఆమె విజ్ఞతను కూడా ప్రశ్నార్థకంగా మార్చేశాయి. రాజకీయంగా ఏమైనా చేసుకోవచ్చు. అది కేటీఆర్ – సురేఖ లు తేల్చుకోవాలి. కానీ, అసలు రాజకీయాలకు సంబంధం లేని సమంత జీవితాన్ని నడిరోడ్డున పడేలా ఒక సాటి మహిళగా , సీనియర్ మంత్రిగా సురేఖ పేలిన ప్రేలాపనలు మాత్రం ఏమాత్రం హర్షించదగ్గవి కాదనే అంటున్నారు పరిశీలకులు. దీనికి ఆమె తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారని కూడా చెబుతున్నారు.
This post was last modified on October 3, 2024 10:00 am
ఇటీవలే నెట్ ఫ్లిక్స్ లో వచ్చాక దేవర 2 ఉంటుందా లేదా అనే దాని గురించి డిస్కషన్లు ఎక్కువయ్యాయి. డిజిటల్…
ఏపీ సీఎం చంద్రబాబు తన మంత్రులను డిజప్పాయింట్ చేసేశారు. అదేంటి అనుకుంటున్నారా? ఇక్కడే ఉంది వ్యూహం. తాజాగా అసెంబ్లీలో ప్రవేశ…
ఒకప్పుడు థియేటర్లో సినిమా చూస్తూ దోమలు కుడుతున్నా, తెరమీద బొమ్మ మసకమసకగా కనిపించినా ప్రేక్షకులు సర్దుకుపోయేవాళ్లు. ఇష్టమైన యాక్టర్ల నటన…
టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో వైఎస్ షర్మిల సంబంధం ఉందని సోషల్ మీడియాలో చాలాకాలంగా దుష్ప్రచారం జరుగుతోన్న సంగతి…
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా శాసన మండలిలో వైసీపీ, కూటమి పార్టీల సభ్యుల మధ్య వాడీ వేడీ వాదనలు జరుగుతున్న…
టాలీవుడ్ లో నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్లల పెళ్లి విషయం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. సమంతతో…