టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, హీరో అక్కినేని నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి మాజీ మంత్రి కేటీఆర్ కారణమంటూ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల సంచలనం రేపిన సంగతి తెలిసిందే. చాలా మంది హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నారని, ఎంతో మంది హీరోయిన్లు త్వరగా పెళ్లి చేసుకొని సినీ ఇండస్ట్రీ నుంచి తప్పుకోవడానికి కేటీఆర్ కారణమంటూ సురేఖ చేసిన వ్యాఖ్యలు ఇరు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇండస్ట్రీలో సంచలనం రేపుతున్నాయి.
మత్తు పదార్థాలకు అలవాటు పడిన కేటీఆర్ హీరోయిన్లకు కూడా డ్రగ్స్ అలవాటు చేశారని సురేఖ చేసిన ఆరోపణలు షాకింగ్ గా మారాయి. హీరోయిన్లతో రేవ్ పార్టీలు చేసుకొని, వారి ఫోన్లు ట్యాప్ చేసి వారి జీవితాలతో ఆడుకొని ఆ తర్వాత వారిని బ్లాక్ మెయిల్ చేశారని సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కేటీఆర్ కు తల్లి, చెల్లి, భార్య లేరా అని సురేఖ ప్రశ్నించారు.
ఈ క్రమంలోనే సురేఖ కామెంట్లపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. తాను హీరోయిన్ల ఫోన్ లో టాప్ చేశానని కొండా సురేఖ అన్నప్పుడు తన భార్యాపిల్లలు, కుటుంబ సభ్యులు బాధపడలేదా అని కేటీఆర్ నిలదీశారు. సురేఖపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులకు, కామెంట్లకు తమకు ఏం సంబంధం లేదని కేటీఆర్ అన్నారు. గతంలో కాంగ్రెస్ నేతలు మాట్లాడిన బూతులు గుర్తుకు తెచ్చుకోవాలని, వారు తిట్టినప్పుడు ఇతర పార్టీల నేతల మనోభావాలు దెబ్బ తినలేదా అని ఆయన ప్రశ్నించారు.
కొండా సురేఖ, సీతక్కలు…సీఎం రేవంత్ రెడ్డి నోరు ఫినాయిల్ తో కడగాలని కేటీఆర్ సూచించారు. సోషల్ మీడియాలో కేసీఆర్ ను తిట్టినప్పుడు ఎవరూ మాట్లాడలేదని, తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం చేతకాక కాంగ్రెస్ ఇటువంటి రాజకీయాలకు పాల్పడుతుందని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబులు మూసి ప్రాంతంలో తిరగాలని కేటీఆర్ సవాల్ విసిరారు.తమ ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేక తనపై దాడులు చేయిస్తుందని కాంగ్రెస్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
This post was last modified on October 2, 2024 10:15 pm
కమర్షియల్ సినిమాలు ఎంతో కొంత రొటీన్ ఫ్లేవర్ కలిగి ఉంటాయి. ఇది సహజం. పైకి కొత్తగా ట్రై చేశామని చెప్పినా…
``తెల్లారే సరికి పింఛన్లు పంచకపోతే ప్రపంచం తలకిందులు అవుతుందా? ఇది ఉద్యోగులను క్షోభ పెట్టినట్టు కాదా? మహిళా ఉద్యోగులు ఇబ్బందులు…
ఏ రాష్ట్రమైనా కేంద్రం ముందు ఒకప్పుడు తల ఎగరేసిన పరిస్థితి ఉండేది. పట్టుబట్టి సాధించుకునే ప్రాజెక్టులు కూడా కనిపించేవి. కానీ,…
అసలు సాధ్యమే కాదని భావించింది నిజమయ్యింది. రాజమౌళి రికార్డులు మళ్ళీ ఆయనే తప్ప ఇంకెవరు బ్రేక్ చేయలేరనే వాదన బద్దలయ్యింది.…
తెలంగాణలో ఇకపై టికెట్ల రేట్ల పెంపు, స్పెషల్, బెనిఫిట్ షోలు ఉండవని సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో తేల్చి చెప్పిన…
ఏపీలో కూటమి సర్కారుకు పెద్ద చిక్కే వచ్చింది. ఒకవైపు ఉపాధి, ఉద్యోగాల కల్పనతో ముందుకు సాగు తున్న సర్కారుకు.. ఇప్పుడు…