ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున, తెలంగాణ మంత్రి కొండా సురేఖను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. “మమ్మల్ని మీ రాజకీయాల్లోకి లాగకండి. మామానాన మమ్మల్ని వదిలేయండి” అని ఆయన పేర్కొన్నారు. దీంతో నాగార్జున చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సరికొత్త చర్చకు దారి తీశాయి. అసలు సురేఖ ఏమన్నారు? అక్కినేని ఎందుకు రియాక్ట్ అయ్యారనేది మరింత ఆసక్తిగా మారింది.
ఏం జరిగింది?
మంత్రి కొండా సురేఖ, బీజేపీ ఎంపీ రఘునందన రావు కలిసి పాల్గొన్న ఓ కార్యక్రమంలో రఘునందనరావు… సురేఖ మెడలో ఓ దండ వేశారు. దీనికి సంబంధించిన ఫొటోను.. మార్ఫింగ్ చేసి.. తనను అపఖ్యాతి పాల్జేసేలా వ్యవహరించారని మంత్రి సురేఖ బీఆర్ఎస్ నాయకులపై ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ పై మంగళవారం నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. మీడియా సమావేశంలోనే ఆమె కన్నీరు పెట్టుకున్నారు. “షాదీ జీహాద్” అంటూ వ్యాఖ్యానించడాన్ని ఆమె మరింత తప్పుబట్టారు. దీనికి కొనసాగింపుగా కేటీఆర్‌పై బుధవారం మరిన్ని విమర్శలు చేశారు.
ఈ క్రమంలోనే అక్కినేని కుటుంబానికి సంబంధించిన కీలకమైన రెండు విషయాలను సురేఖ ప్రస్తావించారు. 1) అక్కినేని నాగచైతన్య-సమంత దంపతుల విడాకులు. 2) ఎన్-కన్వెన్షన్. ఈ రెండు అంశాలను ప్రస్తావిస్తూ.. మాజీ మంత్రి కేటీఆర్ కేంద్రంగా సురేఖ తీవ్ర విమర్శలు చేశారు. అక్కినేని నాగచైతన్య, సమంత దంపతులు విడిపోవడానికి అప్పటి మంత్రి కేటీఆరే కారణమని ఆమె ఆరోపించారు. ఇక, అప్పట్లో ఎన్ కన్వెన్షన్ కూల్చివేయకుండా ఉండేందుకు.. అక్కినేని నాగార్జున బీఆర్ఎస్ కు దాసోహం చేశారని మరింతగా రెచ్చిపోయారు. బీఆర్ఎస్ పెట్టిన షరతులకు అక్కినేని ఒప్పుకొన్నారని అన్నారు. ఈ వ్యాఖ్యలు జోరుగా వైరల్ అయ్యారు.
అక్కినేని రియాక్షన్
మంత్రి సురేఖ వ్యాఖ్యలపై అక్కినేని వెంటనే రియాక్ట్ అయ్యారు. సహజంగా ఆయన వెంటనే రియాక్ట్ కావడం అనేది లేదు. కానీ, ఈ విషయంలో మాత్రం ఆయన తక్షణం స్పందించారు. ‘గౌరవనీయ మహిళా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను’ అని పేర్కొంటూ.. ఆమె తీరును ఎండగట్టారు. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ రాజకీయ ప్రత్యర్ధులను విమర్శించేందుకు వాడుకోవద్దంటూ ఆయన సూచన చేశారు. అంతేకాదు.. బాధ్యత కలిగిన పదవి లో ఉన్న మంత్రిగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. తమ కుటుంబం పట్ల సురేఖ చేసిన వ్యాఖ్యలు, ఆరోపణలు పూర్తిగా అబద్ధమని పేర్కొన్నారు. తక్షణమే సదరు వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని నాగార్జున డిమాండ్ చేశారు. దీనిపై సురేఖ ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
This post was last modified on October 2, 2024 10:14 pm
ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ కారణంగా చాలామంది ఊబకాయం ,బెల్లీ ఫ్యాట్ తో భాద పడుతున్నారు. మరీ…
ఏపీ మంత్రి వర్గంలో సీఎం చంద్రబాబు గీస్తున్న లక్ష్మణ రేఖలకు.. ఆయన ఆదేశాలకు కూడా.. పెద్దగా రెస్పాన్స్ ఉండడం లేదని…
సంగీత దర్శకుడిగా ఏఆర్ ప్రస్థానం, గొప్పదనం గురించి మళ్ళీ కొత్తగా చెప్పడానికేం లేదు కానీ గత కొంత కాలంగా ఆయన…
యావత్తు దేశం ఆసక్తిగా ఎదురు చూస్తున్న వక్ఫ్ సవరణ చట్టంపై సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. భారత…
నేను లోకల్, ధమాకా దర్శకుడు త్రినాధరావు నక్కిన ఇవాళ జరిగిన చౌర్య పాఠం ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో మాట్లాడుతూ…
భారత్ నుంచి పరారైపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి సంబంధించి రోజుకో కొత్త తరహా వింతలు, విశేషాలు వెలుగు…