బాబుకు అండ గా నిలిచిన చిన్నమ్మ

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ ప్ర‌సాదానికి వినియోగించే నెయ్యి క‌ల్తీ జ‌రిగిందంటూ.. సీఎం చంద్ర‌బాబు మీడియా ముందు చెప్పిన విష‌యం తెలిసిందే. స‌ద‌రు నెయ్యిలో జంతువుల కొవ్వు క‌లిసింద‌ని, ఇది త‌న‌ను ఎంతో బాధించింద‌ని ఆయ‌న గ‌త నెల 18న నేరుగా మీడియా ముందు చెప్పుకొచ్చారు.

అప్ప‌టి వ‌ర‌కు దీనిపై ఎవ‌రూ కామెంట్ చేయ‌క‌పోవ‌డం.. అనూహ్యంగా సీఎం స్పం దించ‌డంతో ఇది పెను వివాదంగా మారిన విష‌యం తెలిసిందే. దీనిపై త‌ర్వాత ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని కూడా నియ‌మించా రు. అయితే.. ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టుకు చేరిన త‌ర్వాత‌.. సీఎం చంద్ర‌బాబును సుప్రీంకోర్టు ద్వి స‌భ్య ధ‌ర్మాసనం నిల‌దీసింది.

నెయ్యిలో క‌ల్తీ జ‌రిగింద‌ని.. మీడియా ముందుకు వ‌చ్చి ఎలా చెబుతార‌ని, అస‌లు నెయ్యి క‌ల్తీ జ‌రిగింద‌న్న రుజువులు ఎక్క‌డ ఉన్నాయ‌ని ప్ర‌శ్నించిన విష‌యం తెలిసిందే. అయితే.. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్య‌ల‌పై టీడీపీ నేత‌ల నుంచి ఎవ‌రూ స్పందించ‌లే దు. కోర్టు అభిమతం మేర‌కు తాము న‌డుచుకుంటామ‌ని మాత్ర‌మే మంత్రులు చెప్పుకొచ్చారు. కానీ, తాజాగా బీజేపీ ఏపీ చీఫ్ ద‌గ్గుబాటి పురందేశ్వ‌రి ఈ విష‌యంపై స్పందించారు. సీఎం చంద్ర‌బాబు చేసిన వ్యాఖ్య‌ల‌ను త‌ప్పుబ‌ట్టాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆమె అన్నారు. మీడియా ముందుకు వ‌చ్చి మాట్లాడేందుకు ఆయ‌నకు అన్ని అర్హ‌త‌లు ఉన్నాయ‌న్నారు.

తిరుమ‌ల శ్రీవారి ల‌డ్డూ వివాదంపై సీఎం చంద్ర‌బాబు మాట్లాడ‌క‌పోతే.. ఎవ‌రు మాట్లాడ‌తార‌ని ఆమె ప్ర‌శ్నిచారు. లడ్డూ వివాదం లో సుప్రీం కోర్టు వ్యాఖ్యలు విన్నాను. కానీ, ఈ విష‌యంలో ఏం జరిగిందో అదే చంద్రబాబు మాట్లాడారు. సీఎం వ్యాఖ్యలపై కోర్టు కామెంట్ చేయడం సమంజసంగా లేదు. సీఎం మాట్లాడకుండా ఉండాల్సింది అనడం సరికాదు. రాజ్యాంగబ‌ద్ధ‌మైన సీఎం పదవిలో ఉన్నందున మాట్లాడే హక్కు ఆయ‌న‌కు త‌ప్ప‌కుండా ఉంటుంది. రాష్ట్రానికి సంబంధించిన ఏ అంశంపైనైనా మాట్లాడతారు. చట్టవిరుద్ధంగా ఏం మాట్లాడలేదు. కానీ లడ్డూ విషయంలో జరిగిందే చెప్పారు అని పురందేశ్వరి వ్యాఖ్యానించారు.